Human vs Animal: ఈ సువిశాలమైన ప్రపంచంలో ఎన్నో వింతలు దాక్కొన్నాయి. మనుషులతో పాటు ఎన్నో జీవజాలాలు ఈ భూమ్మీద నివసిస్తున్నాయి. శాస్త్రవేత్త ఎన్ని కొత్త ఆవిష్కరణలు చేసినా ఏదో ఒక కొత్త విషయం భూమిపై మిగిలిపోతూనే ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు తమ శరీరంలోని ఒక భాగానికి మరొక భాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం గమనించవచ్చు. నిజానికి, మనం ఏదైనా పని చేయడానికి వెళ్లినప్పుడు శరీరంలోని ఆ భాగాలు ఆటోమేటిక్‌గా మొదట పనిలోకి దిగుతాయి. ఇది మీరు ఎడమ చేతివాటం కలిగిన వాడా లేదా కుడిచేతి వాటం కలిగిన వాడా అని నిర్ణయిస్తుంది. కుడిచేతి వాటం కంటే ఎడమచేతి వాటం ఉన్నవారు తెలివైనవారని అంటారు. అయితే మనుషులు మాత్రమే కాకుండా ఇతర జంతువులకు ఎడమచేతి వాటం, కుడిచేతి వాటం ఉంటుందా ? ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం.
సెబాస్టియన్ ఓక్లెన్‌బర్గ్.. రూహ్రర్ యూనివర్సిటీ బోహెమ్‌లోని శాస్త్రవేత్త, తన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన ఫలితాలను కనుగొన్నారు. తన పరిశోధనలో మానవులకు ఎడమ చేతి వాటం లేదా కుడి చేతి వాటం ఉన్నట్లే. జంతువులలో కూడా ఇదే విధంగా ఉంటుందని ఆయన కనుగొన్నాడు. అయినప్పటికీ, చాలా మంది కుడిచేతి వాటం వ్యక్తులు కూడా వారి ఎడమ చేతితో వారి అనేక పనులను చేయడం కనిపించింది. మీరు లెఫ్టి లేదా రైట్ అనేదానికి ఒకే నిర్దిష్ట జన్యువు కారణమని ఇంతకు ముందు నమ్మేవారు. అయితే దీనికోసం ఒక్కటి కాదు అనేక రకాల జన్యువులు తమ పని తాము చేసుకుంటాయని ఇప్పుడు తెలిసింది. అంతేకాకుండా, పర్యావరణం కూడా మన చురుకుదనాన్ని ప్రభావితం చేస్తుంది. ఇందులో మెదడు పాత్ర చాలా కీలకమైనది.
శాస్త్రవేత్తలు ఇది తరచుగా జరుగుతుందని చెబుతున్నారు. ఎడమచేతి వాటంగా ఉన్నట్లయితే వారు సాధారణంగా ఎడమ ఫుటర్‌గా ఉంటారట. ఒక వేళ ముద్దు కోసం తలను ఎడమవైపుకు తిప్పడానికి ఎక్కువ ఇష్టపడుతారట. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు లేదా ప్రసంగం వింటున్నప్పుడు అనుకోకుండా ఎడమవైపు తలను వంచుతారట. ఇవన్నీ వారికి తెలియకుండానే అంతర్గతంగా అనుసంధానించబడి ఉంటాయట. మనుషులకు లాగానే ఇది జంతువులకు కూడా వర్తిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొంతకాలం క్రితం కుక్కలు, పిల్లుల పై ఒక అధ్యయనం జరిగింది. మానవులతో పోలిస్తే ఈ నిష్పత్తి 50-50 జంతువులలో ఎడమ చేతివాటం, కుడిచేతి వాటం నిష్పత్తి సమానంగా ఉంటుందని తేలింది.