Monsoon Hair Care Tips 2025: వర్షాకాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇది జుట్టుకు అనేక సమస్యలను కూడా కలిగిస్తుంది. ఈ సీజన్‌లో తేమ కారణంగా, జుట్టులో చికాకు పెరుగుతుంది. దీని కారణంగా జుట్టు నిర్జీవంగా కనిపించడం ప్రారంభమవుతుంది. వాటిని మెయింటెన్ చేయడం కూడా కష్టమవుతుంది. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ఓ 5 సులభమైన చిట్కాలను పాటించాలి. దీని వల్ల వర్షాకాలంలో కూడా మీరు మృదువైన, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు.
రెగ్యులర్ కండిషనింగ్
వర్షాకాలంలో మీ జుట్టును హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ జుట్టు పొడిగా ఉంటుందా? అయితే మీరు వారానికి 2-3 సార్లు కండిషనర్ వాడటం బెటర్. కొబ్బరి నూనె, తేనె లేదా గుడ్లు వంటి సహజ పదార్ధాలతో తయారు చేసిన కండిషనర్లు జుట్టును తేమగా చేసి, గుబురుగా అనిపించడాన్ని తగ్గిస్తాయి.
ఎలా ఉపయోగించాలి?
జుట్టు వేర్లపై కాకుండా, జుట్టు పొడవు, చివర్లలో మాత్రమే కండిషనర్‌ను అప్లే చేయండి. తర్వాత 5-10 ని. లు ఉంచి చల్లటి నీటితో కడిగేయండి.
వెచ్చని నూనె మసాజ్
గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాలకు పోషణ లభిస్తుంది. కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ నూనె వంటి నూనెలు జుట్టును మృదువుగా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
మసాజ్ ఎలా చేయాలి?
నూనెను కొద్దిగా వేడి చేసి, మీ వేళ్లతో తలపై సున్నితంగా మసాజ్ చేయండి.
30 నిమిషాల నుంచి 1 గంట వరకు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూతో కడిగేయండి.
Also Read: Oil : ఎండాకాలంలో తలకు నూనె పెట్టాలా వద్దా?
హెయిర్ మాస్క్ అప్లై చేయండి
సహజ హెయిర్ మాస్క్‌లు జుట్టుకు లోతైన కండిషనింగ్‌ను అందిస్తాయి. వర్షాకాలంలో జుట్టుకు పోషణ అందించడానికి, వారానికి ఒకసారి హెయిర్ మాస్క్‌ను అప్లై చేయండి.
కొన్ని సులభమైన హెయిర్ మాస్క్‌లు:
అరటిపండు, తేనె మాస్క్ – పండిన అరటిపండును మెత్తగా చేసి, దానికి ఒక టీస్పూన్ తేనె కలిపి, జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి.
పెరుగు, గుడ్డు మాస్క్ – 2 టీస్పూన్ల పెరుగులో ఒక గుడ్డు కలిపి జుట్టుకు అప్లై చేసి, 30 నిమిషాల తర్వాత కడిగేయండి.
తడి జుట్టును దువ్వకండి.
వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ జుట్టును గజిబిజిగా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, తడి జుట్టును దువ్వడం వల్ల అవి విరిగిపోయి గజిబిజిగా మారవచ్చు. మీ జుట్టు ఎండిన తర్వాత మాత్రమే దువ్వండి. వెడల్పాటి దంతాల దువ్వెనను ఉపయోగించండి.
Also Read: Hair Tips: ఈ ఆయిల్ తయారు చేసుకుంటే.. జుట్టు సమస్యలన్నీ పరార్
ఆరోగ్యకరమైన ఆహారం
జుట్టు ఆరోగ్యానికి పోషకాహారం చాలా ముఖ్యం. విటమిన్-ఇ, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది.
మనం ఏమి తినాలి?
మీ ఆహారంలో గుడ్లు, పాలకూర, గింజలు, అవకాడో, చేపలు వంటి పోషకమైన ఆహారాలను చేర్చుకోండి. మీ జుట్టును హైడ్రేట్ గా ఉంచడానికి పుష్కలంగా నీరు తాగండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.