https://oktelugu.com/

Car Engine: కారు ఇంజిన్ వర్షంలో తడిసిపోయిందా? ఇలా చేసి ఖర్చు తగ్గించుకోండి..

Car Engine: ముఖ్యంగా వాహనాలను వర్షా కాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కారు ఉన్నవారు దానిని వర్షంలో ఉంచడం వల్ల ఇంజిన్ పాడైపోతుంది. ఒక్కోసారి వరద ఎక్కువగా రావడం వల్ల కారు మొత్తం మునిగిపోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 25, 2024 4:41 pm
    Monsoon Car Engine Protection Tips

    Monsoon Car Engine Protection Tips

    Follow us on

    Car Engine: ఎండాకాలం వెళ్లిపోయి.. వానకాలం ప్రారంభమైంది. తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణాలు, నగరాలు తడిసి ముద్దవుతున్నాయి. వర్షాకాలం చల్లని వాతావరణం అందిస్తుంది. కానీ వర్షంలో కొన్ని వస్తువులు తడవడం వల్ల భారీగా నష్టం జరుగుతుంది . ముఖ్యంగా వాహనాలను వర్షా కాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కారు ఉన్నవారు దానిని వర్షంలో ఉంచడం వల్ల ఇంజిన్ పాడైపోతుంది. ఒక్కోసారి వరద ఎక్కువగా రావడం వల్ల కారు మొత్తం మునిగిపోవచ్చు. ఇలాంటి సమయంలో ఇన్సూరెన్స్ వల్ల నష్టాన్ని పూడ్చుకోవచ్చు. అయితే కారుకు సంబంధించి ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి నష్టాన్ని పూరించవచ్చు? దీని బెనిపిట్స్ ఎలా ఉంటాయి? ఆ వివరాల్లోకి వెళితే..

    వాహనం ఉన్న ప్రతీ ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వస్తాయి. 4 వీలర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ ను తీసుకోవాలి. అయితే ఇన్సూరెన్స్ అనగానే చాలా మంది తక్కువ పేమెంట్ చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవి కొన్నింటికి మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా కారు వర్షంలో తడిసినప్పుడు కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయితే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కానీ ఇంజిన్ పాడైపోతే మాత్రం ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించదు.

    ఇలాంటప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇంజిన్ పాడైపోయినా జేబులో నుంచి డబ్బులు ఒక్క రూపాయి చెల్లించకుండా నష్ట నివారణను పూడ్చుకోవచ్చు. సమగ్ర ఇన్సూరెన్స్ లో భాగంగా జీరో డెప్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఎన్ సిబీ ప్రొటెక్టర్, ఇంజిన్ ప్రొటెక్టర్, లాక్ రీప్లేస్ మెంట్ వంటి మొత్తం ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఇన్సూరెన్స్ కు ప్రీమియం ఎక్కువగానే ఉంటుంది. కానీ భారీగా కారు డ్యామేజ్ అయినప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

    ఇదిలా ఉండగా 4 వీలర్ వెహికల్ కు కొత్తగా 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ ను పెంచారు. ఇందులో బీమాతో పాటు జీరో డీఏపీ బీమాను కూడా యాడ్ చేయొచ్చు. వర్షకాలంలో మాత్రమే కాకుండా వివిధ ప్రమాదాల్లో కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తించేలా ముందే నిర్ణయించుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి.