Hot Bedding Trend: డబ్బు.. సమస్త ప్రపంచం మొత్తం దీని చుట్టూ తిరుగుతోంది. డబ్బు అనేది లేకుంటే ప్రపంచంలో ఏ పనీ జరగదు. తాగే నీటి నుంచి మొదలుపెడితే పడుకునే పడక వరకు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉన్నదే. అందుకే సమస్త జగతికి డబ్బే మూలం అంటుంటారు. డబ్బుంటే ఏదైనా సాధ్యమవుతుందని.. డబ్బులు లేకుంటే కనీసం అడుగు కూడా బయట పెట్టలేమని అనేక ఉదంతాలు నిరూపిస్తున్నాయి.. ఇంతటి శక్తి ఉన్న డబ్బును సంపాదించడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తే.. మరికొందరు అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తుంటారు. ఇంకొందరు తమ బుర్రకు పదును పెట్టి డబ్బును సంపాదిస్తుంటారు. అలాంటివో మహిళ వినూత్నమైన ఆలోచన చేసి డబ్బును సంపాదిస్తున్నది.
Also Read: అత్యాచారానికి పాల్పడితే పురుషులపై ఆ ప్రయోగం..
ఆ అమ్మాయి పేరు మోనిక్ జెరేమియా. ఈమె ఉండేది క్వీన్స్ ల్యాండ్. కరోనా కంటే ముందు ఈమెకు దండిగా ఆదాయం ఉండేది. తన సొంత దేశంలో ఈమె టీచర్ గా పని చేసేది. కరోనా సమయంలో ఈమె ఉద్యోగం పోయింది. డబ్బు వచ్చే మార్గం లేకుండా పోయింది. డబ్బు లేకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను అన్వేషించినప్పటికీ.. అవేవీ ఆమెకు అనుకూలంగా లేదు. దీంతో ఆమె ఒక వినూత్న ఆలోచన చేసింది.. విశాలమైన తన పడక మీద ఒక్కదానిని పడుకుంటున్నాను.. మరో పక్క ఖాళీగానే ఉంటుంది కదా.. దానిని అద్దెకిస్తే.. ఆదాయం వస్తుంది కదా అన్నట్టుగా ఆమె ఆలోచించింది. అంతే తన బెడ్ పై పక్కను అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టింది. దీనికి హాట్ బెడ్డింగ్ అని పేరు పెట్టింది.
Also Read: పేరూ లేదు.. ఊరూ లేదు..67,000 కోట్లు..అందులో మీవేవైనా ఉన్నాయా?
మోనిక్ చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టు ఎత్తుతో ఆకట్టుకుంటుంది. కవ్వించే శరీర సౌష్టవం ఆమె సొంతం. ఎప్పుడైతే ఆమె హాట్ బెడ్డింగ్ మొదలుపెట్టిందో.. అప్పటినుంచి దండిగా ఆదాయం రావడం ప్రారంభమైంది..హాట్ బెడ్డింగ్ అంటే ఒక మంచాన్ని ఇద్దరు వ్యక్తులు వేరువేరు సమయాల్లో పంచుకోవడం.. అంటే ఒకరు పడుకొని లేచి వెళ్లిపోయిన తర్వాత.. మరొకరి పడుకుంటారు. దీని ద్వారా ఆమె ప్రతినెల దాదాపు 35 వేల వరకు సంపాదిస్తున్నారు. హాట్ బెడ్డింగ్ మాత్రమే కాకుండా డైవర్సిటీ మోడల్స్ అనే మోడలింగ్ ఏజెన్సీ కూడా ఆమె నడుపుతోంది. తద్వారా వచ్చిన సంపాదనను తన అవసరాలకు వినియోగించుకోవడం మాత్రమే కాకుండా.. తనలాగా జీవితంలో ఇబ్బంది పడుతున్న వారికి తోచిన సహాయం చేస్తుంది.. అయితే మోనిక్ కుటుంబ నేపథ్యం గురించి బయటికి తెలియ రాలేదు.. క్వీన్స్ లాండ్ ప్రాంతంలో ఆమె కుటుంబానికి ఎటువంటి ఆస్తులు లేవా? ఒకవేళ ఉంటే.. ఆమె ఇలా ఎందుకు ఇబ్బంది పడుతోంది.. అనే విషయాలకు సంబంధించిన వివరాలు తెలియ రావడం లేదు.