Money Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలావరకు నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని ఏర్పాటు చేసుకొని సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అయితే శాసించే స్థాయికి వెళ్తున్నాయి… కాబట్టి ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎవరు ఎదుగుతారు అనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి సక్సెస్ ను సాధించిన కూడా కొంతమంది స్టార్ హీరోలు మాత్రం నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు… ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో హీరోలు చేసిన సినిమాలు అందులోని కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆలోచింపజేస్తూ ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) సినిమాలోని కొన్ని సన్నివేశాలు మిడిల్ క్లాస్ కి అర్థం పట్టేలా ఉండడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకునే సన్నివేశాలను తెరకెక్కించారు.
మనీ కోసం మనిషి ఏదైనా చేస్తాడు అనే ఉద్దేశ్యంతో కృష్ణంరాజు హీరోగా వచ్చిన ‘గోల్కొండ అబ్బులు’ అనే సినిమాలో రావు గోపాల్ రావు తన కూతురు అయిన జయప్రద కి ఒక ఇల్లు వచ్చిందనే ఉద్దేశ్యంతో ఆల్రెడీ ఆ ఇంట్లో ఉంటున్న వల్ల దగ్గరికి వాళ్లకు డబ్బులు ఆశ చూపించి వాళ్లను నుంచి ఆ ఇంటిని కొనుక్కుంటాడు.
మొత్తానికైతే డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనే ఒక సీన్ ను ఈ సినిమాలో చిత్రీకరించారు… ఇక ప్రస్తుతం ఇలాంటి సిచువేషన్ ను బట్టి ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నాయి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనీకి చాలా వాల్యూ అయితే ఉంది. దాని మీదే ప్రపంచమంతా నడుస్తుందనేది వాస్తవం.
మరి ఆ మనీ ని సంపాదించడానికి ఎవరు ఎలాంటి పనులను చేస్తున్నారు ఎవరు ఎంత గొప్పగా హార్డ్ వర్క్ చేసి సంపాదిస్తున్నారు అనేదే ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఇక ఆ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరు దాదాపు 35 సంవత్సరాల క్రితమే ఇప్పుడున్న సిచువేషన్ ని అంచనావేసి మరి ఆ సినిమాను తీశారు అంటే మామూలు విషయం కాదు అంటూ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు…