Money Savings : ప్రస్తుత కాలంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు. ఉదయం లేచిన దగ్గరనుంచి సాయంత్రం వరకు డబ్బుతోనే జీవితం గడుస్తుంది. అయితే ఈ డబ్బు అందరి వద్ద ఒకేలా ఉండదు. కొందరి వద్ద ఎక్కువగా మరికొందరి వద్ద తక్కువగా ఉంటుంది. ఎక్కువగా డబ్బు ఉన్న వారు ఎంత ఖర్చు పెట్టినా పెద్ద సమస్య ఉండదు. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవైపు ఖర్చులు పెడుతూనే.. మరోవైపు పొదుపు చేయాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంతో పాటు భవిష్యత్తు కాలంలో కూడా బాగుండాలంటే డబ్బు ప్రణాళిక కచ్చితంగా ఉండాలి. అయితే చాలామంది డబ్బులు పోగేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ వాటికి ఎలాంటి ప్రణాళిక ఉండదు. అయితే ఈ ప్రణాళిక ద్వారా డబ్బును ఈజీగా పొదుపు చేసే అవకాశం ఉంటుందని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అదేంటంటే?
Also Read : బ్యాంకు డబ్బులు ఆలస్యమైతే మీకు పెనాల్టీ వస్తుంది.. ఎలాగంటే?
ప్రతి నెల ఆదాయం ఎంత వచ్చినా దానికి తగిన విధంగా ఖర్చులు ఉంటాయి. అయితే ఖర్చులు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒక వస్తువు కొనుగోలు చేయడానికి ఎంత అవసరమో.. దాని ద్వారా ఎంత ఉపయోగమో అయితేనే దానిని కొనుగోలు చేయాలి. అనవసర వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుంది. అంతేకాకుండా వృధా ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఎవరికైనా వచ్చిన ఆదాయంలో అవసరాలు, కోరికలు తీర్చుకోవడం ఎంత అవసరమో పొదుపు చేయడం కూడా అంతే అవసరం. అందువల్ల ప్రతినెలా కనీసం 20 శాతం పొదుపు చేయాలని నిర్ణయించుకోండి. అందుకు సంబంధించిన మొత్తాన్ని పక్కకు పెట్టుకోండి. అయితే పొదుపు చేసే మొత్తం కాస్త తక్కువగానే ఉంటే మంచిది. ఎందుకంటే ఒక నెల పొదుపు చేసి మరో నెల పొదుపు చేయకపోవడంతో డబ్బు నిలువ పెరగదు. అందువల్ల తక్కువ మొత్తంలో అయినా రెగ్యులర్గా పొదుపు చేసే అలవాటు చేసుకోండి.
ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. కానీ కొందరు వీటిని అదుపులో ఉంచుకుంటారు. మరికొందరు మాత్రం కోరికలను చంపుకోలేరు. అయితే కోరికలను చంపుకోవడం వల్ల డబ్బు మిగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆదాయం పెరగకుండా పొదుపు పెరిగి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పిల్లల చదువుల కోసం దీనిని వాడుకోవచ్చు. అందువల్ల కోరికలను తగ్గించుకొని డబ్బులు చేయడం అలవాటు చేసుకోండి.
ఆదాయం పెరిగితేనే విలాస వస్తువులు కొనుగోలు చేయడానికి ముందడుగు వేయాలి. కొందరు తక్కువ ఆదాయం వస్తున్న విలాస వస్తువులకు ఎక్కువ ఖర్చులు పెట్టి ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతారు. అందువల్ల ఆదాయం తక్కువగా ఉన్నవారు విలాస వస్తువులు కొనుగోలు చేయడం మానుకోవాలి. అయితే అంతే ప్రయోజనం ఇచ్చే తక్కువ ధర కలిగిన వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. తప్పనిసరి లేదా అప్పులు చేసి ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు.
డబ్బు అంటే చాలామందికి అవసరమే. కానీ ఇది కొంతమంది వద్దే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు లేని వారికి డబ్బు ఉన్నవారు ఇస్తుంటారు. కానీ డబ్బు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇస్తాడా? లేదా.? అని విషయాన్ని తెలుసుకోవాలి. అలా లేని పక్షంలో ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చి ఆందోళనకు గురి కావొద్దు.
Also Read : మనుషులకు ఇవి ఎంతున్నా సరిపోవు.. ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంటుంది