https://oktelugu.com/

Money : మనుషులకు ఇవి ఎంతున్నా సరిపోవు.. ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంటుంది

చాణక్యుడు ఎన్నో విషయాల గురించి తెలిపారు. ఈయన చెప్పిన విషయాలు చాలా మంది తూ.చ తప్పకుండా ఉపయోగిస్తుంటారు. ఇక ఈయన చెప్పే ఎన్నో మాటలు నిజం అవుతాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 4, 2025 / 03:00 AM IST

    Money

    Follow us on

    Money : చాణక్యుడు ఎన్నో విషయాల గురించి తెలిపారు. ఈయన చెప్పిన విషయాలు చాలా మంది తూ.చ తప్పకుండా ఉపయోగిస్తుంటారు. ఇక ఈయన చెప్పే ఎన్నో మాటలు నిజం అవుతాయి. ఈయన మాటలు పాటిస్తే జీవితం కూడా మార్పు చెందుతుంది. అయితే మనుషుల గురించి కొన్ని విషయాలు చెప్పారు చాణక్యుడు. మనుషులకు ఆశ ఎక్కువ ఉంటుందని.. వారికి కొన్ని విషయాలు అసలు సరిపోవు అని. ఎంత ఉన్నా ఇంకా కావాలి అనిపిస్తుంది అన్నారు చాణక్యుడు. ఇంతకీ ఆయన చెప్పిన ఆ మాటలు ఏంటో ఓ సారి చూసేద్దాం.

    మనుషుల దగ్గర కొన్ని వస్తువులు ఉన్నా సరే అసలు వారి మనసు, మైండ్ రెండు కూడా నిండవు అని.. ఇంకా ఇంకా ఉండాలని కోరుకుంటారు అన్నారు చాణక్యుడు. వీటి వల్ల వారి వినాశనం కూడా జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇంతకీ మనుషులకు ఎలాంటి విషయాల మీద అత్యాశ ఉంటుందో తెలుసుకోండి. మీకు కూడా ఉంటే ఇప్పుడే మానేయండి.

    డబ్బు: మనిషి దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే మరింత ఎక్కువ కావాలి అనుకుంటారు కానీ అసలు సంతృప్తి పడరు. మరింత ఎక్కువ కూడబెట్టాలని చూస్తారు. దీనికోసం మనుషులు చెడు దారుల్లో నడవడానికి కూడా సిద్ధ పడతారు. అయితే ఈ దారులు కొన్ని సార్లు వారికి చాలా సమస్యలను తెచ్చి పెడతాయి. డబ్బు కేవలం అవసరాలు తీర్చేదిగా ఉండాలి కానీ సమస్యలు కొని తెచ్చేదిగా ఉండకూడదు. డబ్బు వెనకాల పరుగెడుతూ చాలా మంది పెద్ద పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. తప్పుడు పనులు చేస్తున్నారు.

    ఎవరూ చావాలనుకోరు: అయితే ఏ మనిషి కూడా చావాలి అనుకోరు. కానీ ఏదో ఒక రోజు మనం చనిపోతామనేది మాత్రం జీవిత సత్యం. కానీ ఎప్పుడు జీవించాలి అనుకుంటారు చాలా మంది. జస్ట్ చావాలి అని చెబుతుంటారు కానీ నిజంగా అడిగి చూడండి. చనిపోవడం అంటే భయం వేస్తుంది.

    స్త్రీ సుఖం: కొంతమంది మగవారు ఒక స్త్రీతో అసలు సంతృప్తి చెందరు. కొన్ని సార్లు స్త్రీలు కూడా అంతే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటారు. ఇలాంటి వారే భార్య/భర్త కాకుండా పరాయి వారితో సంబంధాలు పెట్టుకొని తప్పుల మీద తప్పులు చేస్తారు. దీని వల్ల సంసారం జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి.

    రుచికరమైన ఆహారం: కొంతమందికి ఫుడ్ అంటే ప్రీతి ఉంటుంది. వీళ్లు తినడానికి మాత్రమే బతుకుతారు అన్నట్టుగా ఉంటారు. వీరికి ఎన్ని రకాల ఫుడ్స్ పెట్టినా సరే అసలు తృప్తి ఉండదు. ఎంత టేస్టీ ఫుడ్ తిన్నా తక్కువగానే ఫీల్ అవుతుంటారు. కొందరు ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలి అని కోరుకుంటే మరికొందరు టేస్టీ టేస్టీ ఫుడ్ కావాలి అని కోరుకుంటారు. కానీ ఫుడ్ మాత్రం పక్కా కావాల్సిందే. మీకు కూడా ఇలాంటి అలవాట్లు ఉంటే మాత్రం ఇక నుంచి మానుకోండి.