Savings Vs Health Policy: డబ్బు సేవింగ్స్.. హెల్త్ పాలసీ.. ఏదీ బెటర్?

ఆదాయం వచ్చిన ప్రతి ఒక్కరూ డబ్బు సేవింగ్స్ చేస్తుంటారు. భవిష్యత్ లో ఎటువంటి అవసరాలకైనా ఉపయోగపడుతుందన్న నేపథ్యంలో వివిధ మార్గాల్లో డబ్బును దాచుకుంటారు.

Written By: Srinivas, Updated On : January 9, 2024 4:49 pm

Savings Vs Health Policy

Follow us on

Savings Vs Health Policy: నేటి కాలంలో ప్రతి ఒక్క అవసరానికి డబ్బు ప్రధానంగా ఉంటుంది. డబ్బు లేకపోతే జీవితం గడవడం కష్టంగా మారుతుంది. అందువల్ల రాత్రి, పగలు అని తేడా లేకుండా చాలా మంది ఆదాయం కోసం కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురై హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఎంత పెద్ద రోగం వచ్చినా ఉచితంగానే వైద్యం చేసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకు నెల నెలా కొంత మొత్తం చెల్లించే హెల్త్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాల మంది హెల్త్ పాలసీకి డబ్బు చెల్లించే బదులు సేవింగ్స్ చేస్తుంటారు. ఆదా చేసిన డబ్బులో హాస్పిటల్ బిల్లు చెల్లించుకోవచ్చని అనుకుంటారు. కానీ డబ్బు ఆదా చేయడం బెటరా? లేక హెల్త్ పాలసీ తీసుకోవడం మంచిదా?

ఆదాయం వచ్చిన ప్రతి ఒక్కరూ డబ్బు సేవింగ్స్ చేస్తుంటారు. భవిష్యత్ లో ఎటువంటి అవసరాలకైనా ఉపయోగపడుతుందన్న నేపథ్యంలో వివిధ మార్గాల్లో డబ్బును దాచుకుంటారు. ఇలా దాచుకున్న దాంట్లో హాస్పిటల్ అవసరాలకు కూడా ఉపయోగించుకుంటారు. అయితే ఒక సంవత్సరం పాటు 2 లక్షల వరకు సేవింగ్స్ చేశారనుకుందాం.. కానీ ఈ కాలంలో ఏదైనా పెద్ద వ్యాధి వచ్చి రూ.2 లక్షల కంటే ఎక్కువ అవసరం పడితే అప్పుడు మిగతా వాటి కోసం అప్పు చేయాల్సి ఉంటుంది. లేదా ఈ 2 లక్షలను ఫిక్స్ డ్ లేదా ఇతర పెట్టుబడులు పెట్టినా.. అత్యవసర సమయానికి తీసుకోవడానికి వీలుండదు.

అదే హెల్త్ పాలసీ తీసుకున్నారనుకోండి.. హెల్త్ పాలసీని నెల నెలా లేదా ఒకేసారి ప్రీమియం చెల్లించవచ్చు. ఇలా చెల్లించిన కాలంలో ఏదైనా వ్యాధికి గురైనా లేదా ప్రమాదం జరిగినా ఆ ఖర్చును మొత్తం పాలసీ కంపెనీ భరిస్తుంది. అంతేకాకుండా పాలసీ ప్రీమియం చెల్లించే టప్పుడే కొన్ని నెట్ వర్క్ హాస్పిటల్ ను సెలెక్ట్ చేసుకుంటే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందుతుంది. ప్రత్యేకంగా డబ్బు తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఇలా అత్యవసర సయయంలో హాస్పిటల్ వైద్య అందడమే కాకుండా ఎంచుకున్న ప్రకారం ఖర్చును హాస్పిటల్స్ ఉచితంగానే వైద్యం అందిస్తాయి.

ఇలా ఆరోగ్యం విషయంలో ఆలోచిస్తే డబ్బు సేవింగ్స్ కన్నా హెల్త్ పాలసీ తీసుకోవడం ఎంతో బెటర్. అయితే కటుుంబ సభ్యులు, వారి అవసరాల నేపథ్యంలో ఎంత పాలసీని తీసుకోవాలి? అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఇందు కోసం www.policybazar.com అనే వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రీమియం తక్కువగా చెల్లించాలనుకుంటే దానిని ఫిల్టర్ చేసి ఆ మొత్తంలో చెల్లించి పాలసీని కొనుగోలు చేయొచ్చు. పూర్తి వివరాల కోసం కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలను సంప్రదించవచ్చు.