Money Plant Really Increase Wealth : ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల సంపద వస్తుందా? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. అయితే ఈ మనీ ప్లాంట్‌ను పోథోస్ అంటారు. అంతేకాదు దీనికి మరో పేరు కూడా ఉంది. దీన్ని డెవిల్స్ ఐవీ అని పిలుస్తారు. ఇది చాలా సాధారణమైన ఇంట్లో పెరిగే మొక్క. ఇంట్లో దీన్ని పెంచడం వల్ల అదృష్టం, సంపద వస్తుందని చాలా మంది నమ్ముతారు. మీరు చాలా మంది ప్రజల ఇళ్లలో మనీ ప్లాంట్‌ను చూసి ఉంటారు. మీ ఇంట్లో కూడా మనీ ప్లాంట్ ఉండే ఉంటుంది కదా. మరి నిజంగానే ఈ మనీ ప్లాంట్ వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందా? దీని వెనుక ఎందుకు ఇంత నమ్మకాలు పెరిగాయి వంటి వివరాలు చూసేద్దాం.
మనీ ప్లాంట్ నాటడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చాలా మంది ఈ మొక్కను ఇంట్లోకి సంపద లేదా లక్ష్మి రాకకు శుభప్రదంగా భావిస్తారు. వాస్తు ప్రకారం కూడా, ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఎందుకంటే, ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచుకోవడం వల్ల ఒత్తిడి సులభంగా తగ్గుతుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
మనీ ప్లాంట్‌ను చాలా సులభంగా పెంచవచ్చు. నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఈ మొక్క వివిధ రకాల కాంతి పరిస్థితులలో సులభంగా పెరుగుతుంది. ఫెంగ్ షుయ్ ప్రకారం, మనీ ప్లాంట్లు సానుకూల శక్తిని, శ్రేయస్సును ఆకర్షిస్తాయి. మనీ ప్లాంట్ సంపద, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్ ఆకుపచ్చ ఆకులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇది మీ గదిని చాలా అందంగా కనిపించేలా చేస్తుంది. దీని వల్ల నిజంగానే మనసులో ఉన్న గందరగోళం తొలిగిపోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. దాన్ని చూస్తూనే ఉంటే మనసుకు తెలియని ఉత్సాహం వస్తుంది. సో ప్రజలు యాక్టివ్ అవుతారు. పని బాగా చేస్తారు. తద్వారా సక్సెస్ కూడా సాధించే అవకాశం ఉంటుంది. మనసును, మన మైండ్ సెట్ ను చేంజ్ చేస్తుంది ఈ మనీ ప్లాంట్. అంతేకాదు మనీ ప్లాంట్ ట్రాన్స్పిరేషన్ ద్వారా గాలిలో తేమ స్థాయిని పెంచుతుంది. ఇది పొడి చర్మం, జలుబు, దగ్గుతో పాటు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.
Also Read : మనీ ప్లాంట్ కు ఈ ఒక్కటి కట్టండి చాలు.. మీ ఇంట్లో లక్ష్మి దేవి తాండవం చేస్తుంది..
మనీ ప్లాంట్ అనేది చాలా సాధారణమైన ఇండోర్ ప్లాంట్. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల అదృష్టం, సంపద లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే, దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ మనీ ప్లాంట్ కేవలం ఒక మొక్క మాత్రమే. దీనికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఎటువంటి ఆధారాలు లేవు. ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. దీనితో పాటు, ఇది ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుందని నమ్ముతారు.
మనీ ప్లాంట్ పెంచడం చాలా సులభం. దీనికి ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు. దీనిని నీటిలో లేదా మట్టిలో పెంచవచ్చు. దీనికి ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం లేదు. దీనిని నీడలో కూడా ఉంచవచ్చు. పచ్చగా ఉంచడానికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ ఉండండి. దాని నేల ఎండిపోకుండా కాపాడుకోండి. అంతేకానీ ఈ మొక్క నాటడం వల్ల ఇంట్లో బాగా పెరగడం వల్ల సంపద ఎక్కువ వస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అంటున్నారు నిపుణులు.