Money Earning Tips: ఈ భూమిపైన పుట్టిన ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించాల్సిందే. డబ్బు లేకపోతే అతనికి ఆహారం, సౌకర్యాలు దొరకవు. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమకు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే వారికి ఒకే రకమైన దుస్తులను అందిస్తారు. ఒకే రకమైన చదువులు చెప్పిస్తారు. ఒకే రకమైన ఆహారాన్ని అందిస్తారు. కానీ వారు పెద్దయ్యాక మాత్రం ఒకే రకంగా జీవించలేరు. అందుకు కారణం వారి ఆలోచనల్లో ఉండే తేడాలే. ఒకరు ఒకరకంగా ఆలోచిస్తే.. మరొకరు మరోరకంగా ఆలోచిస్తారు. అయితే వీరిలో ఎవరి ఆలోచనలు డబ్బును శాశ్వతంగా ఉంచుతుందంటే?
ఒక వ్యక్తికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ తక్కువ సమయంలోనే డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఇందుకోసం సక్రమమైన మార్గంలో కాకుండా డబ్బు త్వరగా వచ్చే పనులు చేస్తాడు. ఈ క్రమంలో తప్పులు కూడా చేయవచ్చు. తనకు తప్పు, ఒప్పులతో సంబంధం లేదు డప్పు సంపాదించడమే ధ్యేయమని అనుకుంటాడు. ఒకరిని హింసించినా.. పర్వాలేదు.. మరొకరిని దూరం పెట్టిన నష్టం లేదు అని అనుకుంటూ డబ్బు సంపాదిస్తాడు. ఇదే సమయంలో తనకు డబ్బు వచ్చిన అహంకారంతో తల్లిదండ్రులను పట్టించుకోడు. కుటుంబ సభ్యులను దూరంగా ఉంచుతాడు. న్యాయం, ధర్మం అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు డబ్బు సంపాదిస్తాడు. ఇలా వచ్చిన డబ్బును అతడు కాపాడుకోలేడు. ఎందుకంటే తొందరగా వచ్చిన డబ్బుతో ఏదైనా చేయాలని అనిపిస్తుంది. జల్సాగా ఉండాలని కోరికలు పుడతాయి. ఈ క్రమంలో అతడు డబ్బును తన సొంతానికి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు. కొండలైనా.. ఖర్చుకు కరగాల్సిందే అని ఓ సామెత ఉంది. అలా ఉన్న డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టడంతో చివరికి ఆ వ్యక్తి బికారిలా మారిపోతాడు.
ఇదే కుటుంబంలో జన్మించిన మరో వ్యక్తి ఆలోచన మాత్రం వేరేలా ఉంది. అతడు కూడా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. కానీ న్యాయం, ధర్మంగా ముందుకు వెళ్లాలని అనుకుంటాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ డబ్బులు సంపాదిస్తాడు. అతనికి మిగతా వారి కంటే డబ్బు తక్కువగానే వస్తుంది. కానీ వచ్చిన డబ్బులు కాపాడుకుంటూ ఉంటాడు. అలాగే తాను సంపాదించిన డబ్బును వృథా గా ఖర్చుపెట్టకుండా ఉపయోగపడే పనులు చేస్తాడు. ఇదే సమయంలో ఇతరులతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారితో కలిసి మెలిసి ఉంటాడు. తల్లిదండ్రులను, బంధువులను దూరం చేసుకోకుండా ఉంటాడు. ఇలా అందరి సహకారంతో అతడు కంపెనీలు స్థాపించి ఎంతో డబ్బు సంపాదిస్తాడు. వచ్చిన డబ్బులు సొంతానికి ఖర్చు చేయకుండా.. తన గ్రామంలో స్కూల్స్ కట్టిస్తాడు. ఆస్పత్రిని ఏర్పాటు చేస్తాడు. ఇలా చేయడం వల్ల ఇతరులు కూడా అతనికి సపోర్ట్ గా ఉండి మరింత డబ్బు సంపాదించడానికి అవకాశం ఇస్తారు.
ఇలా ఇద్దరు వ్యక్తులు ఒకే కుటుంబంలో నుంచి వచ్చినా.. వారి ఆలోచనల్లో తేడా ఉండడంతో జీవితాలు ఒకరికి భిన్నంగా మరొకరు గా ఉన్నారు. ఒకరు షార్ట్కట్ లో డబ్బు సంపాదించి చివరికి బికారిలా మిగిలిపోతే.. మరొకరు ఒక్కో మెట్టు ఎక్కి శాశ్వతంగా విజేతగా నిలుస్తూ ఉన్నాడు. అంటే జీవితంలో మంచి పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తే శాశ్వతంగా నిలిచి ఉంటుంది.