Monaco Secret: చాలావరకు దేశాలు, జూదాన్ని ఆడడాన్ని ఒప్పుకోవు. ఒకవేళ ఎవరైనా సీక్రెట్ గా ఆడితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఓ దేశంలో మాత్రం జూదాన్ని అధికారికంగా ఆడుకోవచ్చు. దీంతో చాలా దేశాల నుంచి ఇక్కడికి ధనవంతులు వచ్చి జూదం ఆడుతూ ఉంటారు. అలా కేవలం ధనవంతులు మాత్రమే ఈ దేశానికి రావడంతో ఈ దేశం కూడా ధనిక దేశంగా మారిపోయింది. ధనిక దేశం అంటే ఆశామాషి కాకుండా.. ప్రతి ఒక్కరూ మెర్సీ డేస్ కారును నడుపుతారు.. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా?
పశ్చిమ ఐరోపాలో మూడు వైపులా ఫ్రాన్స్ సరిహద్దులు కలిగిన దేశం మొనాకో. ఈ దేశం మిగతా దేశాలతో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది. చుట్టూ మొత్తం 3.5 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. దేశం మొత్తంలో 35 నుంచి 40,000 మంది జనాభా ఉంటారు. అయితే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 40,000 కార్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులోనూ అన్ని ఖరీదైన కార్లే ఉన్నాయి. రూ.12 కోట్లు కలిగిన అత్యంత ఖరీదైన మెర్సిడెస్ కారు ఇక్కడ మాత్రమే ఉంది. అంతేకాకుండా చాలా దేశాల నుంచి బిగ్ షాట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి చాలామంది ధనవంతులు రావడానికి కారణం ఏంటంటే గ్యాంబ్లింగ్ అధికారికంగా నిర్వహించడం. మిగతా దేశాల్లో ఇది చట్ట విరుద్ధం. కానీ ఈ దేశంలో అధికారికంగానే జూదమును ఆడుతూ ఉంటారు. అందువల్ల ఇతర దేశాల్లోని ధనవంతులు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. ఈ దేశానికి తలసరి ఆదాయం 2.5 కోట్లు. ప్రపంచంలో అత్యధికంగా తలసరి ఆదాయం పొందే దేశాల్లో ఇది కూడా ఒకటి.
ఇలా రావడం వల్ల ఈ దేశం ధనికంగా మారిపోయింది. అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా వ్యాపారం నిర్వహిస్తే వారికి వచ్చే ఆదాయంపై ఎటువంటి టాక్స్ ఉండదు. దీంతో ఎవరు ఎంత కావాల్సి ఉంటే అంత సంపాదించుకోవచ్చు. అడిగేవారు ఎవరూ ఉండరు. ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత ఈ దేశం రెండో చిన్న దేశం గా పేర్కొనబడింది. మధ్యధరా సముద్ర తీరం కలిగి ఉండడం వల్ల ఏడాది పొడవునా ఇక్కడ వాతావరణం హాయిగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మోటార్ రేసింగ్, ఈవెంట్ లైన్ మౌంటే కారులో గ్రాండ్ బ్రిక్స్ వంటి క్రీడలు ఆడుతూ ఉంటారు. దీంతో చాలామంది ఇక్కడికి వచ్చి సరదాగా ఉంటారు.