
Mohammed Siraj IPL2023: వేగంలో నియంత్రణ కోల్పోయి మహా అయితే ఒక బౌలర్ ఒక వైడ్, లేదా ఒక నోబ్, లేదా బౌన్సర్ వేస్తాడు. తర్వాత తన లయ అందుకుంటాడు. ఎందుకంటే బౌలర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తారు కాబట్టి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వైడ్లు వేస్తే.. అది కూడా నెంబర్ వన్ ర్యాంక్ బౌలర్ వేస్తే ఏమనుకోవాలి? ముంబై జట్టు తో జరిగిన మ్యాచ్ లో సిరాజ్ ఇలానే చేశాడు.. బెంగళూరు కొంప ముంచబోయాడు. బ్యాటర్లు మొత్తం విఫలమైనా ముంబై 171 పరుగులు చేసింది అంటే దానికి సిరాజ్ కూడా ఒక కారణమే.
చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఆరంభంలో వరసగా వికెట్లు కోల్పోయింది.. ఆ తర్వాత తేరుకుంది. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ ఆ జట్టుకు ప్రాణం పోశాడు.. రోహిత్ శర్మ, గ్రీన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇలా అగ్రశ్రేణి బ్యాటర్లు మొత్తం విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో బెంగళూరు జట్టు బౌలింగ్ ను తిలక్ వర్మ ఎదిరించి నిలిచాడు.
తన దూకుడైన బ్యాటింగ్ తో 46 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 84 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.. ముఖ్యంగా బెంగళూరు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు..నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న నేహల్ వదేరా తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.. వదేరా కూడా 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్ లతో బెంగళూరు బౌలర్లపై ఎదురు దాడి చేశాడు.. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 171 పరుగులు చేసింది. ప్రారంభంలో కట్టుదిట్టంగా బంతులు చేసిన బెంగళూరు బౌలర్లు.. ఆ తర్వాత బంతి పై నియంత్రణ కోల్పోయారు. 9 ఓవర్లలో 48 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు..171 పరుగులు చేసిందంటే అది ముమ్మాటికి బెంగళూరు బౌలర్ల వైఫల్యమే.

అయితే ఆట ప్రారంభానికి ముందు తేలికపాటి వర్షం బెంగళూర్ బౌలర్లను బంతి పై నియంత్రణ కోల్పోయేలా చేసింది. ఫలితంగా సిరాజ్ 19 వ ఓవర్ లో ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. సిరాజ్ వేసిన తొలి బంతి డాట్ అయింది. రెండో బంతికి ఒక పరుగు లభించింది. మూడో బంతి నుంచి వరుసగా నాలుగు వైడ్లు వేశాడు. ఆ సమయంలో స్ట్రైకింగ్ ఎండ్ లో తిలక్ వర్మ ఉండటంతో సిరాజ్ ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది.. ఇక నాలుగో బంతిని తిలక్ వర్మ ఫోర్ గా మలిచాడు. ఇది సిరాజ్ పై మరింత బత్తిని పెంచింది.. ఫలితంగా ఐదవ బంతిని కూడా వైడ్ వేశాడు. తర్వాతి బంతిని కూడా తిలక్ ఫోర్ గా మలిచాడు.. ఈ ఓవర్ లో సిరాజ్ 11 బంతులు వేయాల్సి వచ్చింది. సిరాజ్ బౌలింగ్ చూసిన నెటిజన్లు ” ఏంటి సిరాజ్.. ఐదు వైడ్లా.. గల్లీ బౌలింగ్ వేస్తున్నావా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Siraj when Arshad started Bowling wides continuously #RCBvMI pic.twitter.com/31BTtIicwm
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) April 2, 2023