Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా తప్పుడు నెంబర్ కు రీఛార్జి చేసిన తర్వాత ఈ డబ్బులు తిరిగి రావాలని చాలామంది అనుకుంటారు. అయితే ఈ డబ్బులు రావడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో చూద్దాం..
ప్రస్తుతం చాలామంది జియో వినియోగదారులు ఉన్నారు. ఈ యూజర్లు రీఛార్జి చేసుకుని సమయంలో తప్పుడు నెంబర్ ఎంటర్ చేయడం వల్ల డబ్బులు వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో తిరిగి డబ్బులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా తప్పుడుగా రీఛార్జ్ చేసిన తర్వాత my jio యాప్ లేదా jio.com ద్వారా నేరుగా రిపండ్లు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది సాధారణ రీఛార్జ్ అయితే మూడు గంటల లోపు క్యాన్సిల్ ప్రత్యేక ప్రారంభించాలి. ఇంటర్నేషనల్ లేదా ఐ ఎస్ డి కి సంబంధించిన రీఛార్జ్ అయితే రెండు గంటల లోపు అప్కమింగ్ స్టేటస్ లో ఉన్న ప్లాన్లకు 30 రోజుల వరకు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది.
ఇందులో రిఫండ్ పొందాలంటే ముందుగా యాప్ ఓపెన్ చేసి మొబైల్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ రీఛార్జ్ హిస్టరీ ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పై క్లిక్ చేసి రీఛార్జ్ క్యాన్సిల్ చేసుకోవాలి. అయితే ఈ రీఛార్జ్ క్యాన్సిల్ కావడానికి 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. మరి కొన్నిసార్లు తక్షణమే యూపీఐ పద్ధతి ద్వారా రిఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎయిర్టెల్ యూజర్లు పొరపాటున రీఛార్జ్ చేస్తే Airtel app లోకి వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలకు బ్యాంకు ద్వారా పరిష్కారం ఉంటుంది. అంటే రీఛార్జ్ అయిన మొత్తం రిఫండ్ కావడానికి బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. మిగతా కంపెనీలు కూడా ఇలాగే తమ యాప్ ల ద్వారా డబ్బులు రిఫండ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ముందుగానే సరైన నెంబర్ను ఎంటర్ చేసి రీఛార్జ్ చేసుకోవాలి. అంతేకాకుండా కంపెనీకి సంబంధించిన యాప్ ల ద్వారా రీఛార్జ్ చేసుకోవడం వల్ల సమస్య తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇతర మార్గాల ద్వారా చేస్తే రిఫండ్ కావడానికి కష్టతరం అవుతుంది.



