Clove Benefits: నేటి కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువే. వాతావరణం కలుషితం కావడంతో పాటు నాణ్యమైన ఆహారం లేకపోవడంతో చాలా మంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో చేరి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పూర్వకాలంలో కొన్ని ఆరోగ్య పద్ధతులు పాటించడం వల్ల చాలా వరకు రోగాలను కంట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో లవంగాలు తప్పనిసరిగా ఉంటాయి. మాంసం కూర వండేటప్పుడు లవంగాలు అత్యవసరమవుతాయి. అయితే లవంగాలను కేవలం కూరల్లో మాత్రమే కాకుండా వాటితో మిగతా పదార్థాలను కలిపి తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
లవంగాలు రుచికి ఘాటుగా ఉంటాయి. కానీ ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. లవంగాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం, ఫాస్పరస్, పోటాషియం, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి. లవంగాలను కేవలం వంట సమయంలో మాత్రమే కాకుండా ఇతర అవసరాల్లోనూ వాడుతారు. దీనిని కాస్మటిక్ తయారీలో, ఫార్మాస్యూటికల్స్ లో ఉపయోగిస్తారు. అందుకే లవంగాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి లవంగాలు కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
లవంగాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అయితే సాధారణంగా కాకుండా దీనిని ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల అనూహ్య ఫలితాలు ఉంటాయి. లవంగాల పొడిని పాలల్లో కలుపుకొని తాగడం వల్ల ఎనర్జీ ఉంటుంది. నార్మల్ మిల్క్ లో కంటే లవంగాలు కలిపిన ద్రవంలో కార్మినేటివ్, స్టిమ్యులెంట్ వంటివి ఉంటాయి. ఇది తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తుంది. ఏదైనా పనిచేసి అలసటగా ఉన్న సమయంలో ఈ ద్రవాన్ని తీసుకుంటే తక్షణ ఎనర్జీవస్తుంది.
నాణ్యమైన ఆహారం లభించకపోవడంతో పాటు శరీరం హెవీ హీట్ వల్ల మలబద్ధకం సమస్యలు చాలా వరకు చూస్తున్నాం. మలబద్ధకం నివారణకు లవంగాలు, పాలు కలిపిన ద్రవం తీసుకోవడం వల్ల ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యల నివారణకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేటికాలంలో చాలా మంది అధిక బరువును కలిగి ఉన్నారు. ఈ సమస్య ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.