Chandrababu : నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు చిత్తూరు జిల్లా నారావారిపల్లి లోఈరోజు నిర్వహించారు. అశేష జన వాహిని నడుమ ఆయన అంతిమయాత్ర సాగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ రామ్మూర్తి నాయుడు హైదరాబాదులో మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్ననే ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని నారావారిపల్లికి తీసుకొచ్చారు.ఈరోజు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.సీఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్,టిడిపి సీనియర్ నేతలు,పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్,ఇతర కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు.హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు చేరుకున్న రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి ఈరోజు మంత్రులు,విఐపి లు సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని నారావారి పల్లిలోని వారి పూర్వీకులకు అంత్యక్రియలు జరిపిన ప్రాంతానికి అంతిమయాత్రగా తరలించారు. యాత్రలో చంద్రబాబుతో పాటు లోకేష్, రోహిత్, నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
* ఇరు కుటుంబ సభ్యులు హాజరు
అంతిమయాత్రలో తమ్ముడు రామ్మూర్తి నాయుడు పాడెను చంద్రబాబు మోసారు.ఆయన రుణం తీర్చుకున్నారు.చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్,నారా రోహిత్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా రామ్మూర్తి నాయుడు పాడే మోశారు. సోదరుడు చంద్రబాబుతో రామ్మూర్తి నాయుడుకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి.చంద్రబాబు రాజకీయ ఉన్నతి వెనుక తమ్ముడు రామ్మూర్తి నాయుడు కృషి ఉంది.అందుకే 1994లో టికెట్ ఇప్పించారు.సొంత నియోజకవర్గ చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు.1999లో రెండోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు.
* ఇంతలోనే విషాదం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు నారా రామ్మూర్తి నాయుడు. పూర్తిగా మంచాన పడ్డారు. ఇటీవలే ఆయన కుమారుడు నారా రోహిత్ వివాహ నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. రామ్మూర్తి నాయుడు ఆసుపత్రిలో ఉండడంతో.. పెద్దమ్మ భువనేశ్వరి అన్ని తానై వ్యవహరించారు. రోహిత్ నిశ్చితార్థ వేడుకలను పర్యవేక్షించారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.కొద్ది రోజుల్లో వివాహ వేడుకలకు సిద్ధపడుతున్నారు.ఇంతలోనే విషాదం అలుముకుంది.రామ్మూర్తి నాయుడు మరణంతో నారావారిపల్లి లో విషాదం నెలకొంది.
తమ్ముడి పాడె మోసి రుణం తీర్చుకున్న చంద్రబాబు-లోకేష్, రోహిత్ సైతం..!#NaraRamamurthyNaidu #RamamurthyNaidu #ChandrababuNaidu #NaraLokesh #NaraRohit pic.twitter.com/2tBm83ozCu
— oneindiatelugu (@oneindiatelugu) November 17, 2024
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababu carried his younger brother rammurthy naidu in the funeral procession
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com