Marital Tips: శృంగారం విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి. లైంగిక విషయంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. తెలిసి తెలియని విధంగా వారి వాదన ఉంటుంది. దీంతో శృంగారం విషయంలో మిడిమిడిగా తెలియడంతో వారికి పలు విషయాల్లో అవగాహన ఉండదు. వివాహం తరువాత సంతానం కలగకపోతే తప్పు మొత్తం మహిళల మీదే నెట్టేస్తారు. కానీ సంతానం కలగకపోవడానికి ఆడ, మగ వారికి సమాన భాగం ఉంటుందనేది అవగాహన ఉండదు. మహిళల్లో అండాశయ సమస్యలు ఉన్నట్లే పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ప్రధాన కారణంగా ఉంటుందనేది గుర్తుంచుకోవాలి.

లైంగిక ఆరోగ్యంపై కూడా అపోహలే ఉంటాయి. సంభోగం సమయంలో వీర్యం స్కలించకపోతే గర్భం రాదని నమ్ముతారు. కానీ ఇందులో నిజం లేదు. యోనిలో ఉన్న పురుషాంగాన్ని స్కలన సమయంలో బయటకు తీస్తారు. ఇలా చేయడం వల్ల గర్భం రాదని అంటుంటారు. కానీ అప్పటికే కొంత వీర్యం పోతే అది కుదరదు. రెండు కండోమ్ లు ధరిస్తే సుఖవ్యాధులు రావని నమ్ముతారు. కానీ రెండు కండోమ్ లు ధరించడం వల్ల అంగం కదలికలో ఒరుసుకుపోయి ఆడవారికి ఇబ్బంది కలుగుతుంది.

గర్భనిరోధక మాత్రల వినియోగం వల్ల సుఖవ్యాధులు రావని విశ్వసిస్తారు. ఇది కూడా నిజం కాదు. గర్భనిరోధక మాత్రలు కేవలం గర్భం రాకుండా నివారిస్తాయి అంతే. లైంగిక వ్యాధులను కంట్రోల్ చేయదు. స్వలింగ సంపర్కులకు మాత్రమే ఏయిడ్స్ వస్తుందని అంటుంటారు. లైంగికంగా కలిసే వారికి అందరికి ఎయిడ్స్ వస్తుంది. మనం కలిసే వారికి ఏయిడ్స్ ఉంటే అది మనకు సోకడం కామనే. ఇలా లైంగిక చర్యల విషయంలో ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్న మాట వాస్తవమే. వాటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంతో గుడ్డిగా నమ్మొద్దు.
Also Read: Relationship Tips: మహిళలను ఆ మూడ్ లోకి తీసుకురావడమెలాగో తెలుసా?
కొందరు సంభోగం తరువాత మూత్ర విసర్జన చేస్తారు. దీంతో ఎలాంటి వ్యాధులు రావని నమ్ముతారు. కానీ ఇందులో నిజం లేదు. సంభోగించిన తరువాత మనం శుభ్రం చేసుకున్నా చేసుకోకపోయినా ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. శృంగారం చేసిన తరువాత మూత్రం చేస్తే మనకు ఇబ్బందులు ఉండవని అంటారు. కానీ ఇది కరెక్టు కాదు. ఇలా లైంగిక చర్యల విషయంలో ఉన్న అపోహలను తొలగించుకుని శాస్త్రీయ విధానాలను మాత్రమే నమ్మాలి. శృంగారం విషయంలో తప్పులు చేయకుండా చూసుకోవాలి.
Also Read: Tips To Cure Constipation: మలబద్ధకం సమస్య పోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే?