Mileage : మన దేశంలో పెట్రోల్ ధరలు చాన్నాళ్ల నుంచి స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.94.77 (దాదాపు రూ.95)గా ఉంది. అదే హైదరాబాద్ లో రూ.107గాఉంది. ఇటీవల ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 వరకు పెంచినప్పుడు మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ చమురు కంపెనీలు ఆ పెరిగిన భారాన్ని భరించాయి. ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించాయి. అయితే పెట్రోల్ ధరలో కేవలం ఒక రూపాయి పెరుగుదల కూడా వాహనం మైలేజ్‌పై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసా ?
Also Read : రూ.50వేలకే ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరిగే కారును సొంతం చేసుకోవచ్చు
పెట్రోల్ ధరలో ఒక రూపాయి పెరుగుదల వాహనం మైలేజ్‌పై చూపే ప్రభావాన్ని తెలుసుకుందాం. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న, అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు మారుతి వ్యాగన్ ఆర్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
మారుతి వ్యాగన్ ఆర్ మైలేజ్
మారుతి వ్యాగన్ ఆర్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లీటరుకు 25.19 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 32 లీటర్లు. అయితే, 1.2 లీటర్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఆటోమేటిక్ వెర్షన్‌లో ఇది లీటరుకు 24.43 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఈ కారు, మైలేజ్ లీటరుకు 25.19 కిలోమీటర్లే అనుకుందాం.
పెట్రోల్ ధర లీటరుకు రూ.95 అనుకుందాం. అప్పుడు 32 లీటర్ల ట్యాంక్ నింపడానికి రూ.3,040 ఖర్చవుతుంది. ఈ మొత్తంతో లీటరుకు 25.19 కిలోమీటర్ల మైలేజ్‌తో మొత్తం 806.08 కిలోమీటర్లు ప్రయాణిస్తారు.ఈ విధంగా కారును ఒక కిలోమీటరు నడపడానికి రూ.3.77 ఖర్చవుతుంది.
ఇప్పుడు పెట్రోల్ ధర కేవలం రూ.1 పెరిగి రూ.96 అయిందని అనుకుందాం. ఇప్పుడు ట్యాంక్ నింపడానికి రూ.3,072 చెల్లించాలి. ఇలాంటప్పుడు, 806.08 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఇప్పుడు ఒక కిలోమీటరు నడపడానికి రూ.3.81 ఖర్చవుతుంది.
అంటే అదే దూరం ప్రయాణించడానికి ఇంతకు ముందు కంటే ఎక్కువ డబ్బు చెల్లించాలి. లేదా మరో విధంగా చెప్పాలంటే ఫ్యూయెల్ కెపాసిటీ తగ్గిపోయింది. పెట్రోల్ ధర ఇంకో రూ.2 లేదా రూ.3 పెరిగితే అప్పుడు ఇంకా పెరుగుతుంది.
Also Read : స్పీడ్, రేంజ్, ధర.. ఓలా ఎస్1 ప్రో+ వర్సెస్ హీరో విడా వి2 ప్రో..ఏది బెస్ట్ ?