Vivo T4 5G : వివో భారతీయ మార్కెట్‌లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తాజాగా తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T4 5Gని విడుదల చేసింది. మిడిల్ రేంజ్ లో విడుదలైన ఈ ఫోన్‌లో రివర్స్ ఛార్జింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 90వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 12GB వరకు RAM, లేటెస్ట్ AI ఫీచర్లు, కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
Also Read : భారీ బ్యాటరీ.. అద్భుతమైన ఫీచర్స్.. అందుబాటులోకి కొత్త ఫోన్..
Vivo T4 5G ఫీచర్లు
డిస్‌ప్లే: ఈ వివో మొబైల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.7-ఇంచుల ఫుల్ HD+ AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
ప్రాసెసర్: స్పీడ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ లేటెస్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగించారు.
కెమెరా : ఈ ఫోన్ వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా సెన్సార్, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP కెమెరా సెన్సార్ ఉంటుంది.
బ్యాటరీ కెపాసిటీ: 90W వైర్డ్ ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్‌తో 7300mAh భారీ బ్యాటరీని అందించారు.
Vivo T4 5G ధర:
ఈ వివో ఫోన్ మూడు వేరియంట్‌లలో అంటే 8GB RAM/128GB, 8GB RAM/256GB, 12GB RAM/256GB రిలీజ్ చేశారు. 128GB వేరియంట్ ధర రూ.21,999, 256GB వేరియంట్ (8GB RAM) ధర రూ.23,999, టాప్-ఎండ్ 12GB RAM వేరియంట్ ధర రూ.25,999.
ఈ ఫోన్ అమ్మకాలు ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి. కొనుగోలు చేసేటప్పుడు HDFC లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్‌లను ఉపయోగిస్తే రూ.2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Vivo T4 5Gకి పోటీ
ఈ ధరల శ్రేణిలో వివో ఈ ఫోన్ రియల్ మీ P2 Pro 5G, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్, పోకో X6 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. రియల్ మీ ఫోన్ 12GB/512GB వేరియంట్ ధర రూ.20,999, మోటరోలా ఫోన్ 12GB/256GB వేరియంట్ ధర రూ.22,999, పోకో ఫోన్ 12GB/512GB వేరియంట్ ధర రూ.24,999.
Also Read : ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లు: సాధారణ ఫోన్ల కంటే బెటరా?