MG Gloster 2.0: ఆటోమోబైల్ రంగంలో SUV కార్ల హవా సాగుతోంది. ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ లెవల్లో కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. దీంతో కంపెనీలు సైతం SUV వెహికిల్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఎంజీ మోటార్స్ నుంచి లేటేస్టుగా కొత్త మోడల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఎంజీ గ్లోస్టర్ గా పిలవబడే దీనిని 29 మే 2023న విడుదల చేయనున్నారు. 4×4 వేరియంట్ ఆధారంగా రూపొందించబడిన ఈ మోడల్ ఫొటోలు మార్కెట్లోకి ముందే ఆన్లైన్లో రిలీజ్ అయ్యాయి. దీనిని చూసిన వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కారు ఫీచర్లేంటి? అని సెర్చ్ చేస్తున్నారు.
MG గ్లోస్టర్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది రెండు ట్యూన్ స్టేషన్లలో పనిచేస్తుంది. 161 బీహెచ్ పీ, 375 ఎన్ ఎం తో ఒకే టర్బో వెర్షన్, 215 బీహెచ్ పీ 480 ఎన్ ఎం శక్తి ఇచ్చే ట్విన్ టర్బో యూనిట్ ను కలిగి ఉంది. రెండోది షిప్ట్ -ఆన్ -ఫ్లై 4WD సిస్టమ్ తో పనిచేస్తుంది. రెండు ఇంజన్ ట్యూన్ లలో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ప్రామాణికంగా పనిచేస్తుంది. లీటర్ పెట్రోల్ కు 12 నుంచి 13 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారులో 6 నుంచి 7గురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
SUV కంప్టీట్ బ్లాక్ కలర్ లో మాత్రమే ఉంటుంది. దీని బంపర్ లు, ORVMలు, రెడ్ హైలేట్ లను పొందుతుంది. దీనికి ప్రత్యేక ‘బ్లాక్ స్టార్మ్’ బ్యాడ్జ్ కూడా ఉంది. బ్లాక్ అప్హోల్సరీ, రెడ్ యాంబియంట్ లైటింగ్ తో ఆల్ బ్లాక్ ట్రీట్మెంట్ ఇంటీరియర్ లో దీనిని చూస్తే ఇంప్రెస్ కాక తప్పదు. ఇక దీని ధర విషయానికొస్తే ఎక్స్ షో రూం ధర రూ.38.08 లక్షలు ఉంది. ఆన్ రోడ్ ధరలో మార్పు ఉండే అవకాశం ఉంది.