https://oktelugu.com/

Mental Health: ఈ ఫుడ్స్ తింటే.. మానసిక సమస్యలన్నీ పరార్

మానసిక సమస్యల నుంచి విముక్తి చెందాలంటే యోగా, మెడిటేషన్ చేయడంతో పాటు సరైన ఫుడ్ కూడా తీసుకోవాలి. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఈజీగా మానసిక సమస్యల నుంచి బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి ఫుడ్ తింటే మానసిక సమస్యలు దూరం అవుతాయో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2024 / 03:15 AM IST

    mental-health

    Follow us on

    Mental Health: భూమి మీద ఉన్న మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. మానసికంగా సంతోషంగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఈ రోజుల్లో అందరూ బిజీ లైఫ్‌లో ఉండి చాలా మంది ఎక్కువగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ సమయం నిద్రపోకుండా, వర్క్ బిజీలో ఆందోళనకు గురి అయ్యి చివరకు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. ఇలా చివరికి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి బయటకు రావాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయిన కూడా మానసిక సమస్యలను పెంచుకుంటున్నారు. మానసిక సమస్యల నుంచి విముక్తి చెందాలంటే యోగా, మెడిటేషన్ చేయడంతో పాటు సరైన ఫుడ్ కూడా తీసుకోవాలి. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఈజీగా మానసిక సమస్యల నుంచి బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి ఫుడ్ తింటే మానసిక సమస్యలు దూరం అవుతాయో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

    కూరగాయలు
    మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కూరగాయలు తీసుకోవాలి. డైలీ డైట్‌లో ముఖ్యంగా బ్రోకలీ, బచ్చలికూర, బీట్‌రూట్, ఉల్లిపాయలు, టమోటో వంటి కూరగాయలు యాడ్ చేసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. డైలీ కాకపోయిన వారానికి ఒకసారి అయిన వీటిని తినడం వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి చెందుతారని నిపుణులు చెబుతున్నారు.

    పండ్లు
    ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను డైలీ తినాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, సీజనల్ ఫ్రూట్స్ వంటి తినాలి. వీటిని తినడం వల్ల మానసిక సమస్యలు క్లియర్ కావడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి డైలీ పండ్లను తినడం అలవాటు చేసుకోండి.

    ప్రోటీన్
    డైలీ తిన ఫుడ్‌లో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్, సార్డినెస్, గుడ్లు, పెరుగు, చికెన్ వంటి ప్రొటీన్-రిచ్ ఫుడ్స్‌ని చేర్చుకోవడం వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. డైలీ ఎక్కువగా ప్రొటీన్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల కండరాలు కూడా బలంగా తయారవుతాయి. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

    గింజలు
    పోషకాలు ఎక్కువగా ఉండే అవిసె గింజలు, చియా గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వాల్‌నట్స్, బాదం వంటివి తినాలి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అనవసర ఆలోచనలు రాకుండా కాపాడతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులోని పోషకాలు ఎక్కువగా ఆందోళనకు గురి కాకుండా చేస్తాయి. దీంతో కొంత వరకు మానసిక ఇబ్బందుల నుంచి బయట పడతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.