https://oktelugu.com/

Jeans: అమ్మాయిలు.. జీన్స్ కొనే ముందు ఈ విషయాలు మరిచిపోవద్దు

పల్లేటూరులో తక్కువగా జీన్స్ ధరించేవాళ్లు ఉంటారు. కానీ పట్టణంలో అయితే ఇక అందరూ జీన్స్ వేసుకునే వాళ్లే ఉంటారు. ఎవరో ఒకరు సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు. అయితే అమ్మాయిలు జీన్స్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలు అసలు మర్చిపోకూడదు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2024 / 03:14 AM IST

    Jeans

    Follow us on

    Jeans: ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే ధరించే జీన్స్ ఇప్పుడు అమ్మాయిలు కూడా ధరిస్తున్నారు. రోజురోజుకీ పెరుగున్న ఫ్యాషన్ నేపథ్యంలో ఇందులో చాలా మోడల్స్ వచ్చాయి. చాలా కంఫర్ట్‌గా ఉంటాయని ఎక్కువమంది వీటినే ధరిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వీటిని ధరిస్తారు. ఫ్యాషన్ అంటే నచ్చని వాళ్లు మాత్రమే వీటిని ధరించరు. సాంప్రదాయ చుడిదర్ ధరించే వాళ్లు కూడా కుర్తీస్‌కి సెట్‌గా జీన్స్ ధరిస్తున్నారు. దేశంలో యువత అయితే ఎక్కువగా పాశ్చాత్య కల్చర్‌కి బాగా అలవాటు పడింది. ఎక్కడ చూసిన జీన్స్ వేసుకుని కనిపిస్తారు. పల్లేటూరులో తక్కువగా జీన్స్ ధరించేవాళ్లు ఉంటారు. కానీ పట్టణంలో అయితే ఇక అందరూ జీన్స్ వేసుకునే వాళ్లే ఉంటారు. ఎవరో ఒకరు సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు. అయితే అమ్మాయిలు జీన్స్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలు అసలు మర్చిపోకూడదు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

    జీన్స్ తీసుకునేటప్పుడు ఆపిల్ ఆకారంలో ఉండే జీన్స్‌ను ఎంచుకోండి. అంటే హై-వెయిస్ట్ జీన్స్ తీసుకోవాలి. అలాగే బూట్‌కట్ లేదా స్ట్రెయిట్-లెగ్ జీన్స్ తీసుకోండి. లూజ్‌గా ఉండే జీన్స్ కాకుండా స్కిన్ ఫిట్‌గా ఉండే జీన్స్‌ను తీసుకోవడం ఉత్తమం. అయితే ఒక్కోరి శరీరాన్ని బట్టి ఒక్కో జీన్ సెట్ అవుతుంది. అయితే లావుగా ఉన్నవారు ఎక్కువగా బూట్‌కట్ జీన్స్ తీసుకోవడం మంచిది. బాగా హైట్‌ ఉన్నవారు స్ట్రెయిట్ లెగ్ ఉన్న జీన్స్ సెట్ అవుతాయి. అమ్మాయిలు ఎలా అంటే జీన్ నచ్చితే చాలు తీసుకుంటారు. కనీసం దాని క్వాలిటీ ఎలా ఉంది. బాడీకి సెట్ అవుతుందా? లేదా? అనే విషయం ఆలోచించరు. కొందరు అమ్మాయిలకి అసలు మిడ్ రైజ్ జీన్స్ సెట్ కావు. ఇవి నాభికి కొంచెం దిగువన ఉంటాయి. కాబట్టి మీకు ఏ జీన్ అయితే సెట్ అవుతుందో అవి తీసుకోండి. ఫ్యాషన్ కదా అని గుడ్డిగా ఫాలో అయిపోవద్దు.

    జీన్స్ అనేవి ఎక్కువగా వేసుకుంటే రక్తప్రసరణ సరిగ్గా జరగదు. అయితే వీటిలో నాణ్యత లేని జీన్స్ అసలు వాడవద్దు. నాణ్యత ఉన్నవాటిని వాడటం మంచిది. వీటివల్ల చర్మ సమస్య రాకుండా ఉంటాయి. బాగా బరువుగా ఉండేవి కాకుండా నాణ్యత ఉండి తేలికగా ఉండే జీన్స్‌ను వాడటం ఉత్తమం. ఇవి అయితే వాడటానికి కూడా చాలా రిలాక్స్‌గా ఉంటాయి. కొన్ని జీన్స్‌లు తొందరగా షేడ్స్ వస్తాయ. ఇవి ఒకటి రెండు సార్లు వేశాక పోతాయి. కాబట్టి కొనేటప్పుడు కాస్త చూసుకుని కొనడం మంచిది. జీన్స్‌ను ఎక్కువ గంటలు కూడా రోజులో ధరించకూడదు. బాగా ఫిట్‌గా జీన్స్ ఉండటం వల్ల అవి కాళ్లకు గట్టిగా అతుక్కుంటాయి దీంతో కొన్నిసార్లు రక్తం గడ్డకడుతుంది. కాబట్టి వీటిని ఎక్కువ గంటలు ధరించవద్దు. అలాగే నిద్రపోయేటప్పుడు వీటిని తప్పకుండా తీసేయండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.