Fake Friends: ఈ ప్రపంచంలో స్నేహ బంధం చాలా ముఖ్యమైనది. కానీ కొందరు స్నేహితుల పరువు తీస్తున్నారు. పైకి ప్రేమగా వెన్న పూసినట్లు మాట్లాడతారు. కానీ మనసులో మాత్రం చాలా పగ పెంచుకుంటారు. నిత్యం మీ మంచి కంటే చెడునే ఎక్కువగా కోరుకుంటారు. మన దగ్గర మంచిగానే మాట్లాడుతారు. ఇతరుల దగ్గరకు వెళ్లి మన గురించి బ్యాడ్‌గా చెబుతుంటారు. ఇలాంటి టాక్సిక్ పీపుల్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం కంటే ఒంటరిగా ఉండటం మేలు. అయితే కొందరికి నిజమైన ఫ్రెండ్స్ ఎవరో, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో కూడా తెలియదు. దీంతో లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజుల్లో అందరూ కూడా మాస్క్ వేసుకుని ఉంటారు. దీంతో ఎవరూ ఎలాంటి వారో కూడా కనిపెట్టలేరు. కొందరు ఫేక్ ఫ్రెండ్స్ వల్ల వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇలా మోసపోయిన వారు ఎందరో ఉన్నారు. మరి మీ చుట్టూ ఉన్నవారిలో నిజమైన ఫ్రెండ్స్ ఎవరో కనిపెట్టడం ఎలాగో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
కష్టాల్లో వదలని వారు
నిజమైన స్నేహితులు ఎంత కష్టం వచ్చిన కూడా మధ్యలో వదిలేయరు. కష్టాల్లోనూ, సంతోషాల్లోనూ కూడా తోడు ఉంటారు. అదే ఫేక్ ఫ్రెండ్స్ అయితే వారి అవసరానికి మీ దగ్గర ఉంటారు. అదే మీకు ఏదైనా అవసరం లేదా సమస్య వస్తే మధ్యలో వదిలేస్తారు. నకిలీ స్నేహితులు అయితే కనీసం మిమ్మల్ని అర్థం చేసుకోరు. ప్రతీ విషయంలో మీ తప్పులను గుర్తించి ఇతరుల దగ్గర మీ గురించి బ్యాడ్‌గా చెబుతారు.
అవసరం ఉంటేనే..
కొందరు స్నేహితులు అవసర ఉంటేనే మీతో ఉంటారు. ఉదాహరణకు వాళ్లకు ఏదైనా పని ఉంటే.. పార్టీ, లేదా ఇంకా ఏదైనా మీతో అవసరం ఉంటేనే కలుస్తారు. లేకపోతే అసలు మిమ్మల్ని కలవరు. ఇలాంటి ఫేక్ ఫ్రెండ్స్‌ను అసలు నమ్మవద్దు. ఎందుకంటే వాళ్ల అవసరం కోసం టైమ్ పాస్ చేసే వాళ్లను అసలు మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు.
డైవర్ట్ చేయడం
ఫేక్ స్నేహితులు మంచి నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంటారు. మంచిగా ఏ విషయాలను అయిన చెప్పకుండా చెడు విషయాల గురించి చెబుతుంటారు. ముఖ్యంగా వాటికే సపోర్ట్ కూడా చేస్తుంటారు. ఇలాంటి ఫ్రెండ్స్‌ను నమ్మవద్దు. మీ మంచి కోరే స్నేహితుడు అయితే మిమ్మల్ని మంచి బాటలోనే నడిపిస్తారు. నిజమైన స్నేహితుడు మీరు తప్పు చేసిన చెబుతాడు. కానీ ఫేక్ స్నేహితుడు మీరు ఎన్ని తప్పులు చేసిన కూడా రైట్ అంటారు. కాబట్టి మీ తప్పులను నిజాయితీగా ఎవరైతే చెబుతారో వారే మీ నిజమైన స్నేహితుడు.
మీ బాధను కోరుకునే వారు
నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మీ సంతోషాన్నే కోరుకుంటాడు. కొందరు మీరు సంతోషంగా ఉంటే చూడలేక అసలు అలాంటి వారు మీ స్నేహితులే కారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.