Husband And Wife Relationship: భార్యాభర్తల బంధం బండి చక్రం లాంటిది. బండికి రెండు చక్రాలు బాగుంటేనే బండి నడుస్తుంది. లేదంటే ఆగిపోతుంది. సంసారం కూడా అంతే. ఇద్దరి మధ్య సమన్వయం ఉంటే సాగుతుంది. లేదంటే విడిపోతుంది. సంసారమనే సాగరంలో ఈదడం మామూలు విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. అన్నింటిని తట్టుకుని నిలబడిన వారే విజేతలుగా నిలుస్తారు. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. కాపురంలో కలతలు రాకుండా చూసుకుంటేనే కలకాలం నిలబడుతుంది. కానీ ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. అసలు మగాడు ఎందుకు ఇతరులతో సంబంధం పెట్టుకుంటాడో చూద్దాం.
ఇంట్లో తరచూ గొడవలు
మన ఇంట్లో నిత్యం ఏదో ఒక విషయంలో రోజు గొడవలు జరుగుతుంటే మగాడి మనసు చివుక్కుమంటుంది. ఇంట్లో లొల్లి అంటే నలుగురిలో నామోషీగా ఉంటుంది. కానీ ఆడవారికి అది అలవాటే. దీంతో వారు నిత్యం ఏదో ఒక విషయంలో గొడవలకు దిగితే మనశ్శాంతి కరువవుతుంది. దీంతో ఉపశమనం కోసం మగాళ్లు మరో తోడును కోరుకుంటారు. ప్రశాంతంగా ఉండే మనిషి కోసం తాపత్రయపడతారు. అందులో అతడికి బాగా నచ్చిన స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇక్కడ లేని మనశ్శాంతి అక్కడ కోరుకుంటాడు.
అర్థం చేసుకోకపోవడం
మహిళలు పురుషులను సరిగా అర్థం చేసుకోకపోతే కూడా ఇబ్బందులు వస్తాయి. కొందరు ఆడవాళ్లు చీటికి మాటికి అనుమానిస్తారు. దీంతో మగాళ్ల బుర్ర గిర్రున తిరుగుతుంది. ఇదెక్కడి ఖర్మరా బాబూ అంటూ నిట్టూరుస్తారు. దీంతో కూడా వారికి మనసు కకావికలం అవుతుంది. దీంతో కూడా వారు ఇతరుల తోడు కోరుకుంటారు. ఇంట్లో నిత్యం ఏదో రగడ జరుగుతుంటే ఇక ఏం చేస్తారు బయట వారిని చూసుకుని మురిసిపోతుంటారు.
ఆఫీస్ లో టెన్షన్ ఇంట్లో..
కొందరు ఆఫీసులో పని సరిగా కాకపోతే ఆ నెపం ఇంట్లో వాళ్లపై కూడా చూపిస్తుంటారు. దీంతో కూడా మనశ్శాంతి కరువవుతుంది. దీని వల్ల కూడా భాగస్వామి మీద కోపం ఉంటుంది. చీటికిమాటికి విసుక్కుంటే కూడా మనసు అదోలా ఉంటుంది. దీని వల్ల కూడా అతడు వేరే మహిళను కోరుకుంటాడు. ఇంట్లో లేని సుఖం ఆమె దగ్గర చూసుకోవడం మామూలే. ఇలా వివాహేతర సంబంధాలు ఏర్పడటానికి కారణాలు ఇవే.