Men Afraid: ఒక వ్యక్తి తాను ఒక పనిని చేయలేనని అనుకున్నప్పుడు ఇన్ సెక్యూరిటీగా ఫీలైనప్పుుడు వారి శరీరంలో భయం ఏర్పడుతుంది. ఇది ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలుసు. కానీ మగవాళ్లు కూడా కొన్ని విషయాల్లో చాలా భయపడిపోతుంటారు. వారు ఎంతటి ధైర్యవంతులైనా ఈ విషయాల్లో ఇన్ సెక్యూరిటీగా ఫీలయి ఆందోళన వాతావరణంలో గడుపుతారు. ఒక కుటుంబంలో మగవారికే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఓ వైపు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు కుటుంబ బాధ్యతలను పట్టించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని పనులు పూర్తిచేయలేకపోవడంతో ఇన్ సెక్యూరిటీగా ఫీలవుతారు. ఆ విషయాల గురించి వివరాల్లోకి వెళితే..
ఆడవాళ్లు తమలోని బావాలను చాలా వరకు బయటపెడుతూ ఉంటారు. కానీ మగవాళ్లు అలా కాదు. తమ ఎక్స్ ప్రెషన్స్ ను షో చేయడంలో ఫెయిల్ అవుతారు. దీంతో అవసరమైన చోట సరైన ఫీలింగ్ లేకపోవడంతో ఎదుటివారికి వీరి గురించి బ్యాడ్ ఓపినియన్ ఏర్పడుతుంది. దీంతో తాను ఏదో తప్పు చేశాననే భావంతో ఫీలవుతారు. కొందరు ఇలాంటి పరిస్థితి వస్తుందేమోనని ముందే భయపడిపోతుంటారు.
మగవారు కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు ఉద్యోగం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎక్కడా తమ విధులు సరిగా నిర్వర్తించలేక ఉద్యోగాన్ని కోల్పోతామోనన్న భయం వారిలో ఎక్కువగా ఉంటుంది. నేటి కాలంలో ఉద్యోగ భద్రత కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో నిత్యం భయంతో కూడుకొని విధులు నిర్వహిస్తున్నారు.
ప్రేమను పంచడంలో ఆడవారిని మించిన వారు లేరు. అయితే కొందరు మగవారు కూడా తమ ప్రేమ, విశ్వాసాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారు. కానీ అందరివల్ల కాదు. ముఖ్యంగా దంపతుల్లో తమ భాగస్వామిపై ప్రేమ తక్కువగా చూపుతున్నానేమోననే ఫీలింగ్ చాలా ఉంటుంది. ఈ విషయంలో వారు ఎక్కువగా భయపడిపోతుంటారు.
ఆడవారు అందంగా ఉండాలని మగవారు కోరుకుంటారు. కానీ మగవారికి కూడా మంచి ఫిజిక్ ఉండాలని కోరుకుంటారు. అయితే పిజిక్ కాస్త తక్కువగా ఉన్నవారు ఇన్ సెక్యూరిటీగా ఫీలవుతారు. తమను ఎవరూ చూడలేరని, ఎవరూ పట్టించుకోరని భయపడిపోతుంటారు. ఒక్కోసారి సెల్ఫ్ కాన్ఫిడెంట్ తగ్గినట్లుగా ఫీలవుతారు.