Memory Improvement tips : ఒక వ్యక్తి ప్రతిరోజు ఎన్నో రకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఓవైపు ఉద్యోగం, మన వైపు కుటుంబ పోషణ, ఇంకోవైపు ఇతర లక్ష్యాలను ఛేదించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటారు. అయితే నేటి కాలంలో ఆహారపు అలవాట్లు, ఇతర వ్యసనాల కారణంగా మతిమరుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో జ్ఞాపకశక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పెడితే కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఇప్పటికే ఎన్నో రకాలుగా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొన్ని క్రమ పద్ధతిలో పాటించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగైన స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎలాంటి పనులు చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..
Also Read : హలాసనం వేయడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గి ముఖ కాంతి పెరుగుతుంది. మరిన్ని ప్రయోజనాలు కూడా..
ప్రతి వ్యక్తికి ప్రతిరోజు ఎన్ని గంటల నిద్ర అవసరం. కానీ కొన్ని కారణాలవల్ల చాలామందికి నిద్ర గడియారానికి భంగం కలుగుతుంది. దీంతో సరైన నిద్ర పోవడం లేదు. ఫలితంగా ఇది మెదడుపై ప్రభావం పడి మతిమరుపు ఎక్కువగా మారుతుంది. అయితే మెదడు చురుగ్గా ఉండాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా అంటే నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలా లేకపోతే మతివరపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పెద్దలకంటే పిల్లల్లో జ్ఞాపకశక్తి ఎక్కువగా అవసరం ఉంటుంది. అయితే చాలామంది పిల్లలు ఇతర ఒత్తిడిలు, అవగాహన లోపం కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ ఉంటారు. వీరిలో జ్ఞాపకశక్తి రావడానికి పెన్ పేపర్ ను ఉపయోగించాలి. ప్రతి విషయాన్ని ఒక పేపర్ పై రాసుకొని దాని గురించి గుర్తుపెట్టుకోవాలని చెప్పాలి. ఇలా చేయడం ద్వారా పెద్దలు కూడా కొన్ని విషయాలను మర్చిపోకుండా ఉంటారు.
జ్ఞాపకశక్తి బాగుండాలంటే నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. దీంతో మెదడు ఉల్లాసంగా మారి మంచి ఆలోచనలు వస్తాయి. అలా కాకుండా ప్రాసెస్ ఫుడ్ తోపాటు ఇతర వ్యసనాలు ఉండడంవల్ల జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశం. ముఖ్యంగా అతిగా మద్యం సేవించే వారిలో మతిమరుపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఎటువంటి రుణాలు జోలికి పోకుండా.. సాధారణ ఆహారం తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీంతో కొన్ని విషయాలను గట్టిగా గుర్తుపెట్టుకుంటారు.. అందువల్ల ఫ్యామిలీ మెంబర్ తో నిత్యం ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది. వ్యాయామ వల్ల శరీరం ఆరోగ్యంగా మారుతుంది. మెదడు కూడా సరిగ్గా పనిచేస్తుంది. అందువల్ల ఇటువంటి వారైనా న్యాయమం తప్పనిసరిగా చేయాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. వినోద కార్యక్రమాలు ఎక్కువగా చూడాలి. ఇలా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైనా విషయం ఉంటే దాని గురించి పూర్తిగా రాజు ఇవ్వాలి.