
KL Rahul : లక్ష్యం 200కు పైగా ఉంది. ఓపెనర్ గా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చాడు. ఎవరైనా ఏం చేస్తారు? దంచికొడుతారు. కానీ మన కేఎల్ రాహుల్ కొద్దిరోజులుగా ఫాం కోల్పోయి తటపటాయిస్తూ ధనాధన్ ఐపీఎల్ లోనూ అదే జిడ్డూ బ్యాటింగ్ తో విసిగిస్తున్నాడు. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్.సీబీ)తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన బ్యాటింగ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ తో చాలా మంది సెటైర్లు వేస్తున్నారు.
బెంగళూరుతో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా వచ్చి 12వ ఓవర్ వరకూ క్రీజులో ఉన్నాడు. 20 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ గా దంచి కొట్టి బాటలు వేయాల్సింది పోయి ఇలా జాగ్రత్తగా నిదానంగా ఆడి విమర్శలు కొనితెచ్చుకుంటున్నాడు.
https://twitter.com/D4nAfc/status/1645472947270983680?s=20
అయితే రాహుల్ మాత్రం తాను పరిస్థితిని బట్టి నిదానంగా ఆడానని.. వికెట్లు కోల్పోవడంతోనే పరిస్థితి గమనించి చివరి వరకూ ఆడాలని కోరారు. క్రీజులో కురుకుంటే మంచి ఇన్నింగ్స్ ఆడవచ్చనే ఇలా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడానని వెల్లడించారు.
అయితే బెంగలూరు ఉంచిన 213 పరుగుల లక్ష్యం ఛేదనకు ఏమాత్రం గబారా పడకుండా కేఎల్ రాహుల్ నిదానంగా బ్యాటింగ్ చేసిన తీరుపై విమర్శలు కురిశాయి. చివర్లో లక్నో బ్యాట్స్ మెన్ పూరన్ వచ్చి 12 బంతుల్లోనే ఆఫ్ సెంచరీతో దంచికొట్టబట్టి ఈ మ్యాచ్ గెలిచింది కానీ.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వల్ల కాదని చెప్పొచ్చు. కేఎల్ టీ20ల్లోనూ ఇలా జిడ్డుగా బ్యాటింగ్ చేయడంపై అందరూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక నిన్న బెంగలూరుపై విజయంతో లక్నో 4 మ్యాచుల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకెళ్లింది.
https://twitter.com/hyperKohli/status/1645467698330222597?s=20