Mayank Agarwal: కొద్ది రోజుల్లో ఐపీఎల్ సంబరం ప్రారంభం కానుంది. దీంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో ఒక్కో నిర్వహణ సంస్థ రూ. కోట్లు ఖర్చు చేసి ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఎలాగైనా కప్ గెలవాలనే ఉద్దేశంతో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా పంజాబ్ కింగ్ తమ జట్టు కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ ను ఎంచుకుంది. జట్టులో సీనియర్ ఆటగాళ్లున్నా మయాంకే కీలకమని భావించి అతడిని నాయకుడిగా ఎంచుకుంది.

ఇప్పటి వరకు పంజాబ్ కింగ్ ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా ఆ కోరిక నెరవేర్చుకోవాలని భావిస్తోంది. దీనికి గాను ఆటగాళ్లను సమాయత్తం చేస్తోంది. ఎంతమంది కెప్టెన్లను మార్చినా ఇంతవరకు పంజాబ్ తలరాత మారకపోవడంతో ప్రస్తుతం ఎలాగైనా ట్రోఫీ సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.
Also Read: మరో వివాదంలో చిక్కుకున్న మోహన్ బాబు కుటుంబం.. ఏమైందంటే..?
కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు న్నా మయాంక్ కే ఫ్రాంచైజీ ఓటు వేయడంతో ఈసారి విజేతగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా మయాంక్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా రాణించి పంజబ్ కు ఎన్నో విజయాలు అందించారు. దీంతో ఈ సారి కూడా ఇదే జోడి దూకుడుగా ఆడి ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మయాంక్ ఎలాగైనా కప్ సాధించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
జట్టు యాజమాన్యం కూడా మయాంక్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో కోచ్ అనిల్ కుంబ్లే కూడా మయాంక్ ఆటతీరుకు ఫిదా అయిపోతున్నారు. అతడితోనే పంజాబ్ ఆశలు నెరవేరేలా ఉన్నాయని ధీమాగా చెబుతున్నారు. ఇందుకోసమే వ్యూహాలు రూపొందిస్తున్నారు. మయాంక్ సారథ్యంలోనే జట్టు విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నారు.

పంజాబ్ కింగ్స్ రాబోయే ఐపీఎల్ లో మెరుగైన ఆట తీరు ప్రదర్శించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్ కింగ్స్ ను విజయపథంలో నిలపాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీని కోసమే నిరంతరం శ్రమిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సారి కప్ గెలవడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ ఫామ్ హౌస్కు ఆ ఇద్దరు.. పెద్ద స్కెచ్ వేశారుగా..!