Best Selling Car : ప్రస్తుతం కార్ల వినియోగం పెరుగుతోంది. 2022లో కార్ల వాడకం ఎక్కువైంది. మధ్య తరగతి వారు కూడా కారు వాడుతున్నారు. ప్రజలు తమ సౌకర్యం కోసం కార్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో కొత్త మోడళ్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. గత సంవత్సరంలో బెస్ట్ సెల్లింగ్ కారుగా మారుతి కార్లు ప్రచారంలోకి వచ్చాయి. మారుతి కారుకు మంచి మైలేజ్ ఉండటంతో దీన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.

మారుతి సుజుకి వ్యాగనార్ కారును ఎక్కువ మంది కొనుగోలు చేశారు. దీని మోడల్ నచ్చడంతో ఎక్కువ మొత్తంలో ఈ కార్లను బుక్ చేసుకున్నారు. మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉండటంతో దీన్ని చాలా మంది ఇష్టపడ్డారు. 2022 అమ్మకాల్లో దీనిదే అగ్రస్థానం కావడం గమనార్హం. ఈ ఏడాది ఏకంగా రెండు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయంటే దీనికి జనం ఎంతగా మొగ్గు చూపారో అర్థమవుతోంది. ఈ కారులో సీఎన్జీ వేరియంట్ ఏకంగా 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండటంతో ప్రజలు ఎక్కువ మంది దీన్ని లైక్ చేసిన వారే. కేజీ సీఎన్జీ ధర రూ. 80గా ఉంది. రూ.80తో 34 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు.
ప్రస్తుతం మారుతి వ్యాగనార్ రేటు రూ.5.47 లక్షల నుంచి రూ.7.2 లక్షల వరకు పెరిగింది. 2022లో ఎక్స్ షో రూం ధరల్లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. దేశంలో 2 లక్షల యూనిట్ల మార్క్ ను దాటిన ఒకే ఒక కారుగా గుర్తింపు పొందడం గమనార్హం. 2019లో మారుతి వ్యాగనార్ కారులో బిగ్ అప్ డేట్ వచ్చింది. కంపెనీ కొత్త ప్లాట్ ఫామ్ పై దీన్ని రూపొందించింది. కొత్త డిజైన్ తో మార్కెట్లోకి వచ్చింది. ఇంటీరియర్స్ కూడా పెరిగాయి. దేశంలోని రోడ్లపై 30 లక్షల కార్లు పరుగులు పెడుతున్నాయి.
దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కారుగా ఇది ఖ్యాతి గడించింది. దీంతోనే అమ్మకాలు అంతలా పెరిగాయి. ఈ క్రమంలో ఈ కారు 5 సీటర్ ఆప్షన్ లో ఈ కారు అందరికి నచ్చింది. చిన్న కుటుంబానికి అనువుగా ఉందని అందరు వాడుతున్నారు. ఈకారులో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్, 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఆకర్షిస్తున్నాయి. 1.0 లీటర్ ఇంజిన్ కారు లీటరుకు 25 కిలోమీటర్ల దూరం వస్తోంది. సీఎస్ జీ వేరియంట్ అయితే కేజీకి 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 1.2 లీటర్ ఇంజిన్ కారు అయితే లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం గమనార్హం.
మారుతి సుజుకి వ్యాగనార్ కారులో 7 ఇంచుల స్మార్ట్ ప్లే స్టూడియో టచ్ స్క్రీన్ ఇన్నోవ్ మెంట్ సిస్టమ్, నావిగేషన్, క్లౌడ్ బేస్డ్ సర్వీస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎన్, ఈడీఐ, రివర్స్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండటంతో ఫోర్ స్పీకర్లు, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఏఎంటీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కారు పలు రంగుల్లో ఆకర్షిస్తోంది.