spot_img
Homeబిజినెస్Maruti Suzuki: కారు లవర్స్‌కు మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌..!

Maruti Suzuki: కారు లవర్స్‌కు మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌..!

Maruti Suzuki: మీరు కారు లవర్సా… కొత్త కారు కొనే ప్లానింగ్‌లో ఉన్నారా?.. మారుతీ కారు కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం మారుతి కంపెనీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ కార్లపై కస్టమర్లకు వేల రూపాయల డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ పమిత కాలమే ఉంటుందని పేర్కొంది.

నెక్సా మోడళ్లపై భారీ డిస్కౌంట్‌..
మారుతీ సుజుకీ ఇండియా తన నెక్సా మోడళ్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. కొత్తగా కారు కొనే ప్లానింగ్‌లో ఉన్న వారు ఈ డీల్స్‌ సొంతం చేసుకోవచ్చు. మిగతా కార్లపై కూడా భారీగా తగ్గింపు ఆఫర్‌ ఇస్తుంది. ఈ ఆఫర్‌ ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటుంది.

డిస్కౌంట్స్‌ ఇలా..
– మారుతీ సుజుకీ తన మారుతీ బాలెనో కారుపై రూ.35 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో క్యాష్‌ డిస్కౌంట్‌ రూ.20 వేల వరకు ఉంది. ఎక్సే్చంజ్‌ ఆఫర రూ.10 వేలు, స్క్రాపేజ్‌ బోనస్‌ రూ. 5 వేలు వంటివి కలిసి ఉన్నాయి.

– మారుతీ సియాజ్‌ కారుపై రూ.33 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఇందులో ఎక్సే్చంజ్‌ బోనస్‌ రూ.25 వేల వరకు ఉంది. స్క్రాపేజ్‌ బోనస్‌ రూ.5 వేలు ఉంటుంది. ఐఎస్‌ఎల్‌ ఆఫర్‌ రూ. 3 వేలు లభిస్తుంది. అయితే ఈ కారుపై ఎలాంటి క్యాష్‌ డిస్కౌంట్‌ అందుబాటులో లేదు.

– మారుతీ ఇగ్నిస్‌ కారుపై రూ.69 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. క్యాష్‌ డిస్కౌంట్‌ రూ.35 వేల వరకు ఉంటుంది. ఎక్సే్చంజ్‌ డిస్కౌంట్‌ రూ.15 వేల వరకు ఉంటుంది. ఎక్సే్చంజ్‌ బోనస్‌ రూ.10 వేలు ఉంది. స్క్రాపేజ్‌ బోనస్‌ రూ.5 వేలు, ఐఎస్‌ఎల్‌ ఆఫర్‌ రూ.4 వేలు లభిస్తోంది.

ప్రాంతాలను బట్టి డిస్కౌంట్‌ మారే చాన్స్‌..
అయితే ఇక్కడ కారు కొనుగోలుదారులు ఒక విషయం గుర్తించుకోవాలి. కారు డిస్కౌంట్‌ ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్‌షిప్, కారు మోడల్, వేరియంట్‌ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల కొత్తగా కారు కొనే వారు దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి ఆఫర్‌ వివరాలను పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. లేదంటే చేతి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి రావొచ్చు. కేవలం మారుతీ సుజుకీ మాత్రమే కాకుండా నిస్సాన్‌ ఇండియా, హోండా కార్స్‌ వంటి కంపెనీలు కూడా జూన్‌లో ఆఫర్లను ప్రకటించాయి. అందువల్ల కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారు ఈ కంపెనీల ఆఫర్లను కూడా చెక్‌ చేసుకుంటే మంచిది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper
Exit mobile version