
David Warner : ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆటలోనే కాదు.. బయట జనాలను అలరించడంలోనూ ముందుంటాడు. స్వచ్ఛమైన ఎంటర్‌టైనర్ గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వార్నర్ రాణించి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన విదేశీ క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. పెద్ద ఎత్తున భారతీయ అభిమానులతో ప్రేమించబడే క్రికెటర్ గా వార్నర్ నిలిచారు. తాజాగా ఇండియా -ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ సందర్భంగా ఇడియన్ మూవీల్లోని ఐకానిక్ స్టెప్‌ను వేయాలని అభిమానులు అభ్యర్థించినప్పుడు అలాగే స్టేడియంలో డ్యాన్స్ చేసి వార్నర్ అలరించాడు. ఇక ‘పుష్పా’ స్టైల్లో ‘తగ్గేదేలే’ పోజు ఇవ్వాలన్నప్పుడు కూడా వార్నర్ అంగీకరించాడు. జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో “తగ్గేదేలే” అన్న సంజ్ఞ చేసాడు.
Warner never fails to entertain 🫠 😍😂✅ #INDvAUS pic.twitter.com/paTbn8olvv
— Bat Ka Grip (@8408Rohit) February 10, 2023
నాగ్‌పూర్‌లో జరిగిన నాలుగు-మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్‌లో బ్యాట్‌తో విఫలమైన 36 ఏళ్ల వార్నర్ మ్యాచ్ మధ్యలో మాత్రం అభిమానులను అలరించాడు. అల్లు అర్జున్ చిత్రం పుష్పలోని ఐకానిక్ స్టెప్ చేస్తూ అలరించాడు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/_Cricpedia/status/1624315304414429184?s=20&t=d2QmBmyu5JDJ4cGpGB62Dg
మరొక వీడియోలో ఆస్ట్రేలియా ఫీల్డింగ్ సమయంలో వార్నర్ ఇండియన్ పాపులర్ డ్యాన్స్ స్టెప్ వేస్తూ అభిమానులను అలరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్‌ను చూడటానికి పెద్ద సంఖ్యలో గుమిగూడిన భారతీయ అభిమానులను అలరిస్తూ వార్నర్ అందరినీ ఆకట్టుకున్నాడు. అభిమానులు కోరిన కోరికలు తీర్చాడు.
ప్రపంచ నంబర్ 1 టెస్ట్ జట్టు ఆస్ట్రేలియా మొదటి టెస్టులో భారత జట్టు చేతిలో ఘోరంగా ఓడింది. వారు కేవలం మూడు రోజుల వ్యవధిలో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో దారుణంగా ఓడారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ 120 మరియు రవీంద్ర జడేజా (70), అక్షర్ పటేల్ (84) నుండి అర్ధసెంచరీలు చేసిన భారత భారీ స్కోరుకు బాటలు వేశారు. మొత్తం 400 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల పెద్ద ఆధిక్యం సంపాదించిపెట్టారు.
ఆ తర్వాత రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు.కేవలం 32.3 ఓవర్లు ఆడి 91 పరుగులకే ఆలౌట్ అయ్యారు. రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్‌లో తన 31వ ఐదు వికెట్ల ప్రదర్శనను చేసి ఆస్ట్రేలియా నడ్డివిరిచాడు. రవీంద్ర జడేజా మరియు ఇతరుల మద్దతుతో టీమిండియా భారీ తేడాతో సిరీస్ మొదటి మ్యాచ్ గెలవడానికి సహాయపడ్డారు.
ఓవైపు ఆస్ట్రేలియా ఓడిపోతున్నా.. తనూ సరిగా పరుగులు చేయకుండా వెనుదిరిగినా కూడా సీరియస్ మ్యాచ్ లో తగ్గేదేలే అంటూ డ్యాన్స్ స్టెప్ తో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారత అభిమానులను అలరించడం విశేషం.