Mahila Samman Scheme: మహిళల కోసం బెస్ట్ సేవింగ్స్ స్కీం.. లక్ష డిపాజిట్ కు ఎంత వడ్డీ ఇస్తున్నారంటే?

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోస్టాఫీసుల్లో వివిధ రకాల సేవింగ్స్ స్కీంలు ఉన్నాయి. వీటిలో ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి. బాలికల కోసం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ఉన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవదచ్చు.

Written By: Chai Muchhata, Updated On : August 1, 2024 12:53 pm

Mahila Samman Scheme

Follow us on

Mahila Samman Schem: ఒకప్పుడు ఎన్నో రకాలుగా అణచివేతకు గురైన ఆడవాళ్లు.. ఇప్పుడు అన్నీ రంగాల్లో దూసుకుపోతున్నారు. కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో తమ సత్తా చూపుతున్నారు. ముఖ్యంగా డబ్బు సంపాదించడంలో పురుషులతో పోటీ పడి కుభేరులుగా అవతరిస్తున్నారు. అయితే కొందరు డబ్బు సంపాదిస్తున్నారు గానీ.. దానిని సేవ్ చేసుకోవడంలో పొరపాట్లు చేస్తున్నారు. చాలా మంది మహిళలకు తమకు వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో మాత్రమే దాచుకుంటారు. లేదా ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తుంటారు. కానీ మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన పథకాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల అధిక రాబడిని పొందుతారు. మహిళల కోసం పోస్టాపీసుల్లో ప్రత్యేకంగా ఒక పథకం ఉంది. బ్యాంకుల కంటే పోస్టాఫీసుల్లో ఎక్కువ వడ్డీ వస్తుంది. అంతే కాకుండా ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినందున ఇందులో డబ్బు సెక్యూరిటీ ఎక్కువ. అయితే పోస్టాఫీసులో డబ్బు దాచుకునే సమయంలో కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి. ఒక్కసారి డబ్బు ఫిక్స్ చేస్తే కనీసం ఏడాది పాటు విత్ డ్రా చేయకుండా ఉండాలి. ఆ తరువాత ఎంత కాలం గడువు నిర్ణయించుకుంటున్నారో.. ఆ గడుడులోపు తీసుకోవాలనుకుంటే ఫెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కనీసం 2 సంవత్సరాల వరకు డబ్బు అవసరం లేదు అన్న వాళ్లు ఇలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. అయితే మహిళల కోసం ఉన్న ఈ ప్రత్యేక పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? ఇందులో ఎంత వడ్డీ వస్తుంది? ఆ వివరాల్లోకి వెళ్దాం..

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోస్టాఫీసుల్లో వివిధ రకాల సేవింగ్స్ స్కీంలు ఉన్నాయి. వీటిలో ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయి. బాలికల కోసం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ఉన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవదచ్చు. అలాగే మగళ పిల్లల చదువు కోసం కూడా పథకాలు ఉన్నాయి. అయితే ఆడవారి కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. లోక్ సభ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ ఈ పథకం వివరాలు చెప్పారు. అదే ‘ మహిళా సమ్మాన్ స్కీమ్’.

మహిలలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే నేపథ్యంలో 2023 లోక్ సభ బడ్జెట్ సమయంలో ‘ మహిళా సమ్మాన్ స్కీమ్’ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం మహిళలకు రూ. 1000 నుంచి రూ. 2,00,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పెట్టుబడి మొత్తంపై 2 సంవత్సరాల వారకు మెచ్యూరిటీ ఉంటుంది. అయితే ఏడాది తరువాత ఉన్న మొత్తంపై 40 శాతం వరకు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఉదాహరణకు రూ. 1,00,000 లు డిపాజిట్ చేస్తే.. ఈ మొత్తంపై 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తారు. అంటే రెండు సంవత్సరాల వరకు 16,022 కలిపి మొత్తం రూ.1,16,022 ను అందిస్తారు. అదే రూ. 2,00,000 డిపాజిట్ చేస్తే రూ. 32,044 వడ్డీ అందుతుంది. రూ. 50 వేలు పెట్టుబడి పెడితే రూ.8,011 వడ్డీ ఇస్తారు. అయితే ఒక్కసారి డిపాజిట్ చేస్తే ఏడాది వరకు ఎలాంటి మొత్తం విత్ డ్రా చేసే అవకాశం ఉండదు. కానీ ఏడాది తరువాత రెండు సంవత్సరాల లోపు 40 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మిగతా మొత్తంపై వడ్డీ కొనసాగుతుంది.

మహిళలకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినట్లయితే ఈ స్కీం బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. దీనిని ఎక్కడి పోస్టాపుసుల్లోనైనా తీసుకోవచ్చు. ఎవరైనా మహిళలు ఈ పథకానికి అర్హులే.