Maha Shivratri: శివుడికి భక్తులంటే ఇష్టమని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం.. అందుకే ఆయన భక్తులు ప్రతి రోజు పూజలు చేస్తూ ఉంటారు. మహా శివరాత్రి అనేది శివుడికి ఎంతో ఇష్టమైన రోజని చెబుతుంటారు. అందుకే ఆ రోజంతా మెలుకువతో ఉండటం, ఆయన నామాన్ని స్మరించడం, ఉపవాసం ఉండటం లాంటి చేస్తుంటారు చాలా మంది. ఇలా రాత్రంతా మెలకువగా ఉండి చేసే శివార్చర. అభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. ఇదే కాకుండా మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. దీని వల్ల గృహస్తులకు ఆరోగ్య పరంగా, పుణ్యం పరంగా మంచి ఫలితాలు వస్తాయని చెబుతుంటారు.

మహా శివరాత్రి రోజున శివుడిని శాస్త్రాల ప్రకారం ఆరాధించినా, లేక ఏమీ తెలియని వారు కేవలం శివలింగంపై చెంబెడు నీళ్లు పోసినా రెండూ సమానమేనని చెబుతుంటారు. భక్త కన్నప్ప సైతం ఇలాంటి కోవకు చెందిన వాడే. ఇదిలా ఉండగా హైందర సాంప్రదాయాల్లో నిత్య పక్ష మాస మహా యాగ అనే ఐదు రకాలుగా శివరాత్రులు ఉంటాయి. ప్రతి రోజు శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి కిందకు వస్తుంది. ప్రతి మాసంలోనూ శుక్ల, బహుళ చతర్దశి రోజున శివున్ని ఆరాధించడం పక్ష శివరాత్రి కిందకు వస్తుంది.
Also Read: పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో మరోసారి ఘనంగా తెలిసింది
ఇక బహుళ చతుర్ధశి రోజు శివుడిని ఆరాదించేది మహా శివరాత్రి కిందకు వస్తుంది. శివరాత్రి రోజున శివుడికి అభిషేకం కానీ లేదా శివారాధన చేయడం అత్యంత పవిత్రమని, ప్రాధాన్యమని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. మహా శివరాత్రి రోజున సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 2 గంటల మధ్య రుద్రాభిషేకం, శివార్చనలు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని సైతం ఇస్తాయని నమ్మకం.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారనే వాదన వచ్చింది. ఆ టైంటో శివుడు లింగరూపం దాల్చుతాడు. ఈ లింగానికి ఆది, అంత్యలను కనుక్కోవడాలని బ్రహ్మ, విష్ణువులకు చెబుతాడు. విష్ణువు శ్వేత వరాహ రూపంలో మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో బ్రహ్మా లింగం పై భాగం వైపు వెళతాడు. ఆది ఎక్కడుంతో ఆయన తెలుసుకోలేకపోతాడు.

అదే టైంలో బ్రహ్మకు కేతకి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. పువ్వుకు, గోవుకు తాను శివుడిని కనుగొన్నానని దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుని వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు. ఈ క్రమంలో బ్రహ్మను, మొగలిపువ్వును, విష్ణువును శపిస్తాడు శివుడు. ఇక బ్రహ్మ దేవుడికి భూలోకంలో గుడి కానీ, పూజలు కానీ ఉండబోమని శపిస్తాడు. ఇక మొగలిపువ్వుకు పూజలు చేసే అవకాశం లేదని, గోవు ముఖంతో అబద్దం చెప్పి, తోకతో నిజం చెప్పడం వల్ల గో ముఖం చూడటం పాపమని శపిస్తాడు. మహా విష్ణువు నిజం చెప్పడంతో ఆయనకు విశ్వవ్యాప్తంగా ఉండాలంటూ అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: వంగవీటి జిల్లా లొల్లి మళ్లీ మొదలైంది