Lunar Eclipse 2022: నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి నష్టాలు, మరికొన్ని రాశుల వారికి లాభాలు చేకూరనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రహణ బాధల నుంచి విముక్తి కావడానికి కొన్ని రెమిడీలు చేయాల్సి ఉంటుంది. గ్రహణ ఎఫెక్ట్ తో పిల్లల చదువు మందగించడంతో పాటు చెడు అలవాట్లకు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీంతో గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పండితులు సూచిస్తున్నారు. మూడు రాశుల వారు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. 11 రోజుల పాటు హనుమాన్ చాలీసా చదువుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

మేష రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. చంద్రగ్రహణం సందర్భంగా పిల్లల చదువులపై పెను ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దురలవాట్లకు బానసలుగా మారే సూచనలున్నాయి. దీంతో వీరు గ్రహణం సందర్భంగా కొన్ని రెమిడీలు చేపట్టి తమ భవిష్యత్ కు భంగం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఉన్నత చదువులు చదివించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.

తుల రాశి వారు కూడా చంద్ర గ్రహణం సందర్భంగా చేపట్టాల్సిన చర్యల గురించి పట్టించుకోవాలి. వీరికి ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ధనం వృథాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు జఠిలమవుతాయి. కార్యాలయాల్లో పనిచేసే చోట కాస్త మెలకువగా ఉండండి. కోర్టు వివాదాలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. గణపతిని పూజించండి. భవిష్యత్ పై కంగారు పడే అవకాశాలు ఉండటంతో కాస్త మెలకువగా ఉండాలి. మంచి ఫలితాలు వచ్చేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలు కలుగుతుంది.