Improve Memory: జ్ఞాపకశక్తి ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతి వాడి మెదడు 1350 గ్రాములే ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవడంలోనే మన తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికి జ్ఞాపకాలు ఉండటం సహజమే. ప్రస్తుత జీవన శైలిలోజ్ఞాపకశక్తి సమస్యలు వస్తున్నాయి. వృద్ధాప్యంలో రావాల్సిన మతిమరుపు చిన్న వయసులోనే వస్తోంది. జీవితంలో ముందుకెళ్లాలంటే జ్ఝాపకశక్తి దే ప్రధాన పాత్ర అని తెలిసినా మతిమరుపు అనేది కామన్ గా మారిపోతోంది. మెదడుకు పదును పెడితే మతిమరుపు అనేది ఉండదని చెబుతున్నారు.

మన మెదడులో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటారు. ఆరోగ్య సమస్యల కారణంగా మతిమరుపు వస్తుంది. వ్యక్తుల పేర్లు మరిచిపోవడం, చేయాల్సిన పనినే మళ్లీ మళ్లీ చేయడం వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తుంటాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. మతిమరుపు అనేది వంశపారంపర్యంగా వస్తుంది. జ్ఞాపకశక్తి విషయంలో మెదడు పనితీరే ప్రధానం. శారీరకంగా చురుకుగా ఉంటేనే మెదడు పనితీరు బాగుంటుంది. దీంతో వాకింగ్, జాకింగ్, యోగా వంటి చర్యల ద్వారా జ్ఝాపకశక్తి మెరుగుపడుతుంది.
మెదడు పనితీరు బాగు పడాలంటే మానసిక వ్యాయామాలు కూడా తప్పనిసరి. భాష, సంగీతం, ఆర్ట్ వంటి ప్రక్రియల ద్వారా మనసును అదుపులో ఉంచుకోవచ్చు. పజిల్స్ వంటివి మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఆటలు కూడా మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మానసిక వ్యాయామాలతో మన జ్ఝాపకశక్తి అద్భుతంగా పని చేస్తుంది. మనసును కంట్రోల్ లో పెట్టుకుంటే ఎంతో పరిణతి కనిపిస్తోంది. రాత్రి నిద్రపోయే ముందు పత్రికలు, మేగజైన్ లు వంటివి చదివితే ఎంతో మేలు కలుగుతుంది.

సరైన నిద్ర కూడా మన మెదడు పనితీరును చురుకుగా చేస్తుంది. పాలకూర, గోంగూర, మనగాకు, క్యారెట్ వంట కూరగాయలు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయనడంలో సందేహం లేదు. ప్రతి రోజు భోజనం తరువాత ఓ గ్లాస్ మజ్జిగ తీసుకుంటే ప్రయోజనం. ఉదయం, సాయంత్రం యోగా, ప్రాణాయామం వంటివి చేస్తే కూడా మెదడును చక్కగా పనిచేసేందుకు దోహదం చేస్తాయి. దీంతో మనకు జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకునే క్రమంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు జరుగుతుంది.