Sukumar- Devi Sri Prasad: కొన్ని కాంబినేషన్స్ కి మార్కెట్ లో మాములు డిమాండ్ ఉండదు..వీళ్ళ కలయిక లో సినిమా వస్తుంది అని తెలిస్తే ఆ సినిమాకి ఎలాంటి ఎఫ్ర్ట్స్ లేకుండా హైప్ వచ్చేస్తుంది..అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్..ఆర్య సినిమా తో ప్రారంభమైన వీళ్లిద్దరి కాంబినేషన్ పుష్ప సినిమా వరుకు కొనసాగింది..త్వరలో ప్రారంభం కాబోతున్న పుష్ప సీక్వెల్ కి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

రాజమౌళి సినిమాలకు కీరవాణి ఎలా అయితే ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉంటాడో..సుకుమార్ సినిమాలకు కూడా దేవిశ్రీప్రసాద్ అలా ఉంటాడు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి..సుకుమార్ తాను దర్శకత్వం వహించే సినిమాలకు మాత్రమే కాకుండా, తాను కథ మరియు స్క్రీన్ ప్లే రాసే కొన్ని చిన్న సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాద్ గారే సంగీతం అందిస్తూ వచ్చారు..సుకుమార్ దర్శకత్వం వహించే సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి సంగీతం అయితే అందించేవాడో..ఆయన కథలు అందించే సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాద్ అలాంటి సంగీతమే అందించేవాడు..సుకుమార్ అంటే దేవి కి అంత ప్రత్యేకం.
అయితే తొలిసారి సుకుమార్ తన సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ ని కాకుండా కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోకనాధ్ ని పెట్టుకున్నాడు..ఇటీవలే ఈయన కన్నడ ఇండస్ట్రీ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ‘కాంతారా’ సినిమాకి సంగీతం అందించాడు..ఈ సినిమా అంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం ఇతను అందించిన మ్యూజిక్ అని చెప్పొచ్చు..ఇక అసలు విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాకి డైరెక్టర్ సుకుమార్ కథ మరియు స్క్రీన్ ప్లే అందించాడు..ఈ సినిమా కి సుకుమార్ కథని అందించాడు కాబట్టి దేవి శ్రీ ప్రసాద్ ని పెట్టుకుందాం అనుకొని ఆ చిత్ర నిర్మాత BVSN ప్రసాద్ దేవి శ్రీ ప్రసాద్ ని సంప్రదించారట.

దేవి శ్రీ ప్రసాద్ ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు కానీ పారితోషికం నాలుగు కోట్ల రూపాయిలు కావాలని డిమాండ్ చేసాడట..BVSN ప్రసాద్ కి అంత మొత్తం ఇవ్వడానికి ఇష్టమే అయ్యినప్పటికీ సుకుమార్ జోక్యం చేసుకొని ‘ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ దాటిపోతుంది..ఈసారికి మనం దేవిశ్రీ ని వదిలేద్దాం..అంజనీష్ అని ఇటీవలే కాంతారా సినిమాకి సంగీతం అందించాడు..అద్భుతంగా ఉంది..ఈ కథకి అతను అయితే సంపూర్ణ న్యాయం చెయ్యగలడు..పారితోషికం కూడా మన బడ్జెట్ కి సరిపడ ఉంటుంది’ అని సుకుమార్ చెప్పాడట..సుకుమార్ మాట ప్రకారమే దేవిశ్రీ ని తప్పించి అంజనీష్ ని తీసుకున్నాడు నిర్మాత BVSN ప్రసాద్..అలా ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తొలిసారి మిస్ అయ్యింది.