Loan Pre Closure: లోన్ ఫ్రీ క్లోజ్ చేస్తున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్త..

ఒక్కసారి బ్యాంకు లోన్ తీసుకున్న తరువాత దీనిని ప్రీ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ప్రీ క్లోజ్ చేసేవారికి బ్యాంకులు కొంత మొత్తాన్ని వడ్డీని విధిస్తాయి. ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఎక్స్ ట్రా ఛార్జీలు విధిస్తాయి.

Written By: Chai Muchhata, Updated On : January 11, 2024 12:35 pm

Loan Pre Closure

Follow us on

Loan Pre Closure: ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ ఇది కొందరికే సాధ్యమవుతుంది. చాలా మంది డబ్బును కూడబెట్టి.. ఆ తరువాత ఇల్లును నిర్మించుకోవాలని అనుకుంటారు. ఇలా చేస్తే జీవితకాలం అయినా సరిపోదు. అందువల్ల చాలా బ్యాంకులు ముందుగా ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి రుణ సాయం అందిస్తాయి. నెలనెలా కొంత మొత్తాన్ని ఈఎంఐ రూపంలో తీసుకుంటాయి. ఇలా రుణ సాయం చేసిన దానికి కొంత వడ్డీని విధిస్తాయి. అయితే ఇల్లు నిర్మించుకోవడానికి బ్యాంకు లోన్ తీసుకున్న తరువాత మధ్యలో వివిధ మార్గాల్లో డబ్బు అందుతుంది. దీంతో లోన్ ను ఫ్రీ క్లోజ్ చేయాలని అనుకుంటారు. అయితే ఇక్కడ కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవేంటంటే?

ఒక్కసారి బ్యాంకు లోన్ తీసుకున్న తరువాత దీనిని ప్రీ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ప్రీ క్లోజ్ చేసేవారికి బ్యాంకులు కొంత మొత్తాన్ని వడ్డీని విధిస్తాయి. ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఎక్స్ ట్రా ఛార్జీలు విధిస్తాయి. ఇది టెన్యూర్ పూర్తయ్యే వరకు చెల్లించే దానికన్నా తక్కువే ఉంటుందని గ్రహించాలి. అయితే కొందరు నెలనెలా భారం తగ్గించుకోవాలని అనుకునేవారు అదనపు ఛార్జీలు చెల్లించైనా లోన్ ను క్లోజ్ చేస్తారు.

ఇలా చెల్లించానలనుకునేవారు లోన్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పక్కాగా చెక్ చేసుకోవాలి. లోన్ పూర్తయ్యే సమయంలో ఒప్పందం ప్రకారం తీసుకున్న పత్రాలను సరైన విధంగా ఉన్నాయా? లేవా అనేది చూసుకోవాలి. అలాగే ఏదైనా పూచికత్తు పెడితే ఆ వస్తువులను సరిచూసుకోవాలి. లోన్ పూర్తయిన తరువాత ప్రీక్లోజ్ డ్యాక్యుమెంట్ల సంతకాల్లో తేడా ఉన్నాయా? లేవా అనేది సరిచూసుకోవాలి. ఒకవేళ ఆన్ లైన్ లోన్ అయితే మనీ పంపించే అకౌంట్ ను జాగ్రత్తగా పరిశీలించాలి.

లోన్ ఫ్రీ క్లోజ్ చేసే సమయంలో ప్రాసెసింగ్ కు సంబంధించి ఎటువంటి అదనపు ఛార్జీలు వేసే అవకాశం లేదు. ప్రిన్సిపల్ అమౌంట్ కు మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అంతేగానీ ఇతర ఛార్జీలు వేయకుండా చూడాలి. అలాంటి ఛార్జీలు విధిస్తే బ్యాంకు వారిని అడగొచ్చు. గతంలో ఈఎంఐ మిస్ అయిన అమౌంట్ కు సంబంధించిన ఫైన్ ను చెల్లించారా? లేదా ఇప్పుడు విధిస్తున్నారా? అనేది సరిచూసుకోవాలి. ఇప్పుడు కనువిధిస్తే వాటికి కూడా వడ్డీని విధించే అవకాశం ఉంది.