Life Partner : ప్రతి మనిషికి జీవిత భాగస్వామి ఉండాలి. తనకంటూ ఒక తోడు ఉండాలి. మాటలు చెప్పుకోవడానికి.. బాధను పంచుకోవడానికి, సంతోషాన్ని వ్యక్తం చేయడానికి, ఆనందాన్ని ఆస్వాదించడానికి ఒక తోడు కావాలి. ఎందుకంటే మనిషి అనే వాడు భావోద్వేగాలను నియంత్రించుకో లేడు. అలాంటప్పుడు ఒక తోడు కచ్చితంగా అవసరం. మగవాళ్లకు మాత్రమే కాదు.. ఆడవాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. అందువల్లే మన సంప్రదాయంలో పెళ్లి అనేది ఒక కీలక భాగంగా మారిపోయింది. వెనుకటి కాలంలో పెళ్లి జరిగినప్పుడు.. భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితి మంటల్లో వేసేవారు. కాలక్రమంలో ఆ దురాచారం కనుమరుగయిపోయింది. ఆ తర్వాత వితంతు వివాహాలు తెరపైకి వచ్చాయి. ఇక నేటి కాలంలో వివాహాలు సరికొత్త రూపు దాల్చాయి.
వెనకటి కాలంలో వధువు కంటే వరుడుకి కాస్త వయసు ఎక్కువగానే ఉండేది. నేటి కాలంలోనూ ఆ సాంప్రదాయం కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని జంటల విషయంలో మాత్రం ఎందుకు విరుద్ధంగా ఉంటున్నది. వయసు విషయంలో వరుడు కంటే వధువుకే ఎక్కువగా ఉంటున్న సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ జంట విషయంలో కూడా అలానే జరిగింది. కాకపోతే భర్త చేసిన మోసం భార్య జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
Also Read: ఏందయ్యా ఇదీ.. రష్మిక ఇలా తయారైందేంటి? షాకింగ్ లుక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో రాజుపేట అనే ప్రాంతం ఉంది. రాజుపేటలో నాగమణి అనే మహిళ జీవిస్తోంది. మీకు 50 సంవత్సరాలు. గతంలో ఈమెకు వివాహం జరిగింది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గతంలోనే ఈమె భర్తను, కుమారుడిని కోల్పోయింది. ఒంటరిగా ఉండడం ఇష్టం లేక ఒక మధ్యవర్తి ద్వారా ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ద్వారా శేషాపురం ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల శివప్రసాద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు గతంలోనే పెళ్లయిందని.. కరోనా వల్ల భార్య చనిపోయిందని శివప్రసాద్ చెప్పాడు. అతడు చెప్పిన మాటలను నమ్మిన నాగమణి పెళ్లి చేసుకుంది. నాగమణికి బెంగళూరు ప్రాంతంలో పది కోట్ల విలువైన భూమి ఉంది. 15 కోట్ల విలువైన బహుళ అంతస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా చేతిలో నగదు కూడా ఉంది. అయితే వీటన్నింటినీ శివప్రసాద్ విక్రయించాడు. ఆ నగదు కూడా తీసుకొని పారిపోయాడు. దీంతో నాగమణి పోలీసులను ఆశ్రయించింది.
నాగమణికి ఆస్తి ఉందని తెలుసుకొని శివప్రసాద్ ఆమెకు దగ్గరయ్యాడు. శారీరకంగా కూడా మరింత చేరువయ్యాడు. దీంతో నాగమణి అతనికి పూర్తిగా సరెండర్ అయిపోయింది. ఆమెకు ఉన్న ఆస్తులను చూసిన శివప్రసాద్ కు దుర్బుద్ధి పుట్టింది. అందువల్లే ఆమె ఆస్తులపై కన్నేశాడు. అంతేకాదు వాటిని విక్రయించాలని పట్టుబట్టాడు. శారీరకంగా అతనికి పూర్తిగా లొంగిపోయిన నాగమణి.. చెప్పినట్టుగా చేసింది. ఆస్తులు మొత్తం అమ్మిన తర్వాత వచ్చిన నగదు వేరేచోట పెట్టుబడిగా పెడదామని శివప్రసాద్ నమ్మించాడు. అతని మాటలకు నాగమణి నమ్మింది. ఇదే అదునుగా ఆ నగదు మొత్తాన్ని తీసుకొని పారిపోయాడు శివప్రసాద్. దీంతో నాగమణి మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.