Sunday: ప్రతీ ఆదివారం ఈ పనులకు కేటాయిస్తే లైఫ్ ఫుల్ హ్యాపీ..

ఆదివారం రాగానే పిల్లలో చాలా హ్యాపీగా ఉంటారు. ఈ క్రమంలో వారు తల్లిదండ్రులతో గడపాలని అనుకుంటారు. పెద్దలు కూడా ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కనబెట్టి పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి.

Written By: Srinivas, Updated On : September 30, 2023 7:36 pm

Sunday

Follow us on

Sunday: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనితో బిజీగా ఉంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు తీరిక లేకుండా గడుపుతారు. ఇలా ప్రతిరోజూ పనిచేయడంతో శరీరం అలిసిపోయి అనేక అనారోగ్యానికి గురవుతుంది. అందుకే వారంలో ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలని పూర్వకాలంలోనే చెప్పారు. ఆ రోజును ఆదివారంను కేటాయించారు. స్కూలు కెళ్లే విద్యార్థుల నుంచి ఉద్యోగం చేసేవారికి సైతం ఆదివారం వస్తుందంటే ఏదో తెలియని సంతోషం. ఈరోజన ఎలాంటి ఒత్తిడి లేకుండా గడుపొచ్చు అని అనుకుంటారు. అయితే కొందరు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఆదివారాన్ని వృథా చేస్తారు. ఈ రోజును ఒక క్రమపద్ధతిలో వాడుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇంతకీ ఆదివారం ఏం చేయాలి? ఎలా ఉండాలి?

వారంలో ఆరో రోజుల పాటు ఒత్తిడితో కలిగి ఉంటారు. ఈ క్రమంలో మొబైల్ తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఆఫీస్ స్టాప్ తోనో.. ఇతర అవసరాలకు ఫోన్ నిత్యం ఉపయోగిస్తుంటాం. దీంతో కొందరికి ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల తలనొప్పి తీవ్రంగా వేధిస్తుంది. అంతేకాకుండా ఫోన్ స్క్రీన్ ను పదే పదే చూడడం వల్ల కళ్లపై ఒత్తిడిని కలిగిఉంటాయి. అయితే ఆదివారం ఒక్కరోజూ ఫోన్ కు దూరంగా ఉండడం. ఏదైనా మంచి పుస్తకం కొనుకొన్ని పొద్దంతా చదవండి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండడంతో తెలివి కూడా పెరుగుతుంది.

ఆదివారం రాగానే పిల్లలో చాలా హ్యాపీగా ఉంటారు. ఈ క్రమంలో వారు తల్లిదండ్రులతో గడపాలని అనుకుంటారు. పెద్దలు కూడా ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కనబెట్టి పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి. వారితో కలిసి పార్క్ లేదా ట్రిప్ ప్లాన్ వేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి బయటకు వెళ్లడం ద్వారా వారిలో మానసిక ఉత్తేజం వస్తుంది. దీంతో ఆరు రోజుల పాటు ఉన్న ఒత్తిడి ఒక్కసారిగా మాయమైపోతుంది.

రోడ్డున వెళ్లేటప్పుడు చెత్తను చూసి చీదరించుకుంటాం. అదే మనఇంట్లో ఉంటే రోగాలు వస్తాయి.అందువల్ల ఆదివారం హౌస్ క్లీనింగ్ కోసం కేటాయించుకోండి. ఒక వారాన్ని ఇంటిని మొత్తం శుభ్రం చేయడం ద్వారా కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారు. దీంతో రోజూవారి పనులకు దూరంగా ఉండడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

భార్యభర్తలు ఉద్యోగస్తులైతే వారం రోజుల పాటు కలిసి మెలిసి ఉండడం సాధ్యం కాదు. ఈ క్రమంలో వంట చేసుకునే సమయం ఉండదు. ఆదివారం మొత్తం ఏదైనా స్పెషల్ గా కుకింగ్ చేసుకోండి. ఈ సమయంలో ఇల్లాలితో కలిసి భర్త కూడా వంటలో పాల్గొంటే వారి ఆప్యాయతను పొందుతారు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ మరింత ధృఢంగా తయారవుతుంది.

వారంలో ఆరు రోజుల పాటు బిజీ లైఫ్ లో సెల్ఫ్ కేర్ తీసుకోరు. అలాగే వ్యాయామం చేసే సమయం ఉండదు. ఆదివారం ఉదయం కొన్ని గంటల పాటు వ్యాయామం చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు చేసే వ్యాయామం ఆ తరువాత ఆరు రోజుల వరకు ఉపయోగపడే అవకాశం ఉంది.