Life Style: నెలలో జీవితం మారిపోయే టిప్స్..

బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, లీన్ ప్రోటీన్లు ఉన్న ఆహారాలు తినాలి. ఇలా చేస్తే రోజంతా శక్తి బాగుంటుంది. మానసిక స్థితి కూడా అద్భుతంగా ఉంటుంది.

Written By: Swathi, Updated On : April 4, 2024 5:12 pm

Life Style

Follow us on

Life Style: మనం యాక్టివ్ మోడ్ లో ఉండాలా, డియాక్టివ్ మోడ్ లో ఉండాలా అనేది మన చేతిలోనే ఉంటుంది. కోడి కూచే సమయానికి లేస్తే యాక్టివ్ గా బర్రెలు పోయే సమయానికి లేస్తే బద్దకంగానే ఉంటారు. అందుకే కోడి లేని చోట అలారం కూత విని ఐదు గంటలకు లేస్తే చాలా చురుగ్గా ఉంటారు. కొన్ని అలవాట్లు చేసుకోవడం కేవలం ఒకే ఒక నెలలో మీలో మార్పు మీరే గమనిస్తారు. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అయితే అవేంటో చూసేయండి.

ముందుగా ఉదయం ఐదు గంటలకు లేవాల్సిందే. లేచిన తర్వాత వ్యాయామం కాసేపు చేసుకోవాలి. ధ్యానం చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని తట్టుకునేంత శక్తి మీకు ధ్యానం వల్ల వచ్చేస్తుంది. దృష్టి, ఏకాగ్రత కేవలం పనుల మీదనే ఉంటుంది. అంతేకాదు స్పష్టమైన ఆలోచనలను పెంచుతుంది ధ్యానం. డిహైడ్రేషన్ సమస్య ఉంటే ఉదయాన్నే ఒక గ్లాస్ మంచి నీరు తాగండి. లేదా గోరు వెచ్చని నీటిని తీసుకోండి. అందులో కొంచెం నిమ్మరసం కలిపినా ఒకే కానీ ఒక గ్లాసు నీరు మస్ట్.

బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, లీన్ ప్రోటీన్లు ఉన్న ఆహారాలు తినాలి. ఇలా చేస్తే రోజంతా శక్తి బాగుంటుంది. మానసిక స్థితి కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. గంట పాటు నడవడం, యోగా చేయడం మర్చిపోకండి. కేవలం 30 ని.ల వ్యాయామం, 30 ని.లు జోరుగా నడవటం ముఖ్యం. దీనివల్ల రిఫ్రెష్ గా ఉంటారు. నెగిటివ్ ఆలోచనల వల్ల మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగండి.

లక్ష్యాన్ని పెట్టుకొని పని చేయండి. దారి, గమ్యం లేని ప్రయాణం వల్ల లాభం ఉండదు. కాబట్టి లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించేలా కృషి చేయండి. ఫోన్లు, లాప్ టాప్ లు అంటూ ఫుల్ బిజీగా ఉంటున్నారు ప్రజలు. అలాంటి బిజీ లైఫ్ లో చిక్కుకొని చిన్న చిన్న సంతోషాలను కూడా కోల్పోవద్దు. ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ డిటాక్స్ ను అమలు చేయండి. అంటే నిద్రలేచాక కనీసం రెండు గంటలు నో ఫోన్, ల్యాప్ టాప్ అంటూ వాటిని పక్కన పెట్టండి. మెయిల్స్, వాట్సప్, ఇన్ స్టా అంటూ చెక్ చేయకండి. మీకోసం మీరు మాత్రమే ఆలోచిచండి.