https://oktelugu.com/

Sudigali Sudheer: యాంకర్ ప్రదీప్ కి సుడిగాలి సుధీర్ ఝలక్… స్టార్ యాంకర్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి?

యాంకర్ గా ప్రదీప్ హవా తగ్గింది అనడానికి ఇదే నిదర్శనం అని కొందరు అంటున్నారు. అదే సమయంలో ప్రదీప్ కి సుడిగాలి సుధీర్ ఝలక్ ఇచ్చాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : April 4, 2024 / 05:16 PM IST

    Sudigali Sudheer

    Follow us on

    Sudigali Sudheer: ఒకప్పుడు ప్రదీప్ మాచిరాజు తెలుగులో టాప్ మేల్ యాంకర్. వరుస షోలతో బుల్లితెరను దున్నేశాడు. ప్రదీప్ యాంకర్ గా ఉన్న గడసరి అత్త సొగసరి కోడలు మంచి విజయం సాధించింది. దాంతో యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు వెలుగులోకి వచ్చాడు. టచ్ లో ఉంటే చెబుతాను షోతో మరింత పాప్యులర్ అయ్యారు. ప్రముఖ నటులు ఈ షోలో పాల్గొనేవారు. ప్రదీప్ ప్రశ్నలు ఆసక్తి రేపేవి. ప్రదీప్ యాంకర్ గా ఉన్న ఢీ రియాలిటీ షో సైతం విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. పదుల సంఖ్యలో ప్రదీప్ షోలు చేశాడు.

    అయితే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఎంట్రీ తర్వాత ప్రదీప్ హవా కొంచెం తగ్గింది. వాళ్ళు డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. తాజాగా ప్రదీప్ స్థానంలో సుడిగాలి సుధీర్ ని తీసుకోవడం సంచలనంగా మారింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా లో సర్కార్ పేరుతో ఓ షో స్ట్రీమ్ అవుతుంది. ప్రదీప్ యాంకర్ గా ఉన్న ఈ గేమ్ షో మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా నాలుగో సీజన్ ప్రకటించారు. అయితే ప్రదీప్ స్థానంలో సుడిగాలి సుధీర్ ని తీసుకున్నారు. దీంతో ప్రదీప్ అభిమానులు షాక్ అయ్యారు.

    యాంకర్ గా ప్రదీప్ హవా తగ్గింది అనడానికి ఇదే నిదర్శనం అని కొందరు అంటున్నారు. అదే సమయంలో ప్రదీప్ కి సుడిగాలి సుధీర్ ఝలక్ ఇచ్చాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా నిజం కాదు. ప్రదీప్ ని సర్కార్ షో నుండి తప్పించలేదు. ఆయనే తప్పుకున్నారని తెలుస్తుంది. ఇటీవల ప్రదీప్ పూర్తిగా యాంకరింగ్ వదిలేశాడు. ఢీ రియాలిటీ షో లేటెస్ట్ సీజన్ నుండి కూడా తప్పుకున్నాడు. ప్రదీప్ హీరోగా ఓ మూవీ చేయనున్నాడు. దీని కోసం ఆయన మేకోవర్ అవుతున్నాడు.

    ఆ మధ్య జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తూ కనిపించాడు. కండలు కూడా పెంచాడు. తన తదుపరి చిత్రంలో పాత్ర కోసం ఆయన సిక్స్ ప్యాక్ డెవలప్ చేస్తున్నాడు. అందుకే యాంకరింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ప్రదీప్ గతంలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. స్టార్ యాంకర్ అయ్యాక 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే మూవీతో హీరో అయ్యాడు. ఈ మూవీ పర్వాలేదు అనిపించుకుంది . గ్యాప్ తీసుకుని మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.