LIC Mutual Funds: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డబ్బు సంపాదించాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందాలని భావించే వాళ్లకు ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ డెట్ ఫండ్, ఈక్విటీ స్కీమ్స్ లో మంచి రాబడిని అందిస్తుండగా కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఐదు సంవత్సరాలలో రెట్టింపు రాబడిని పొందవచ్చు.
ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఎక్కువ స్కీమ్ లు ప్రస్తుతం 16.5 శాతం నుంచి 18.5 శాతం వరకు మంచి రాబడిని అందిస్తుండటం గమనార్హం. ఎల్‌ఐసీ ఎంఎఫ్ లార్జ్ క్యాప్ ఫండ్ ప్రస్తుతం 16.3 శాతం వార్షిక రాబడిని అందిస్తోంది. ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఏకంగా 2.12 లక్షల రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది. నెలకు ఈ స్కీమ్ లో 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 5.8 లక్షల రూపాయలు పొందవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం లేదా నెలనెలా ఇన్వెస్ట్ చేయడం చేయవచ్చు. ప్రతి నెలా వచ్చే ఆదాయాన్ని బట్టి ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం లేదా నెలనెలా ఇన్వెస్ట్ చేసే విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. నెలకు 500 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
డెట్ ఫండ్స్ స్కీమ్స్ మంచి లాభాలను అందిస్తుండగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమయ్యే అవకాశం ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 18 శాతానికి పైగా రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.