Homeఎంటర్టైన్మెంట్Natyam: 'నాట్యం' సినిమా కాదు.. అద్భుతమైన కళాఖండం: బాలయ్య

Natyam: ‘నాట్యం’ సినిమా కాదు.. అద్భుతమైన కళాఖండం: బాలయ్య

Natyam: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్​ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ.. తానే స్వయంగా నిర్సించిన సినిమా నాట్యం. నిశృంకళ ఫిల్మ్​ పతాకంపై రేవత్ కరుకొండ దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమా అక్టోబరు 22న విడుదలైంది. ఈ సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య..సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. మరుగున పడుతున్న కళకు తిరిగి ప్రాణం పోసి.. వాటిని తెరపైకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ నాట్యం కేవలం సినిమా కాదని..ఒక కళాఖండమని కొనియాడారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని దాని వెనక ఒక సందేశం దాగి ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో నాట్యానికి ప్రాణం పోసి.. భావితరాలకు అందించిన ఘనత సంధ్యారాజుకు దక్కుతుందని బాలయ్య అన్నారు.

అనంతరం దర్శకుడు రేవంత్​ గురించి మాట్లాడిన బాలకృష్ణ. సినిమాకు తానే కెమెరామెన్​, దర్శకుడు, ఎడిటర్​గా వ్యవహరించి అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. ఒక్కో సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారని అన్నారు. ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా తనివితీరనిదని కొనియాడారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా తమ తమ పాత్రల్లో నటించారని బాలకృష్ణ అన్నారు.

మరోవైపు అఖండ సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్నారు బాలయ్య.. దీంతో పాటు ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆహా వేదికగా అన్​స్టాపబుల్​ అనే ఓ టాక్​షోకు హోస్ట్​గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. బాలయ్య హోస్ట్​ అనగానే అటు సినీ ప్రియులతో పాటు, చిత్రసీమలోనూ ఆసక్తి నెలకొంది.  తన కెరీర్​లో తొలిసారి హోస్ట్​గా బాలయ్య కనిపించడం విశేషం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version