https://oktelugu.com/

Ravi Teja: మాస్ మహారాజా ‘ధమాకా’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్..!

Ravi Teja: తెలుగు ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా పేరు పొందిన హీరో రవితేజ.  ఎంతో మంది యువ హీరోలు రవితేజని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మాస్ మహారాజు రవితేజ క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు రవితేజ. ఖిలాడీ, రామారావు ఆన్‌డ్యూటీ చిత్రాలలో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన మార్కెట్ను పెంచుకుంటున్నారు మాస్ మహారాజ్. దసరా పండుగ సందర్భంగా “ధమాకా” అనే టైటిల్ తో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 22, 2021 / 05:39 PM IST
    Follow us on

    Ravi Teja: తెలుగు ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా పేరు పొందిన హీరో రవితేజ.  ఎంతో మంది యువ హీరోలు రవితేజని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మాస్ మహారాజు రవితేజ క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు రవితేజ. ఖిలాడీ, రామారావు ఆన్‌డ్యూటీ చిత్రాలలో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన మార్కెట్ను పెంచుకుంటున్నారు మాస్ మహారాజ్.

    దసరా పండుగ సందర్భంగా “ధమాకా” అనే టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి త్రినాధ రావు నక్కిన దర్శకుడు గా “ధమాకా” తెరకెక్కనుంది.తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు సోషల్ మీడియాలో సమాచారం. పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల రవితేజ సరసన నటిస్తోంది.

    రమేష్ వర్మ దర్శకత్వంలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న “ఖిలాడీ” షూటింగ్ పూర్తి అయినట్లుగా సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.  ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు. హీరో అర్జున్ ముఖ్య పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే  ప్రేక్షకులను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

    శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న “రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో దివ్యాంషా కౌశిక్ హీరోయిన్ గా చేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.  ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.