LIC Job for Women: కేంద్ర ప్రభుత్వం మహిళలను స్వయం సమృద్ధిగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రారంభించిన ఎల్ఐసీ బీమా సఖి యోజన ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా మహిళలు నేరుగా లబ్ధి పొందారు. పార్లమెంట్‌లో సమర్పించిన గణాంకాల ప్రకారం.. ఈ పథకం కింద మహిళలు ప్రతినెలా ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా, వారికి ట్రైనింగ్ ఇచ్చి ఒక స్థిరమైన వృత్తిని నిర్మించుకునే దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఎల్ఐసీ ఈ ప్రత్యేక పథకం కింద మహిళలకు బీమా ఏజెంట్లుగా ట్రైనింగ్ ఇస్తారు. దీని ద్వారా వారు తమ ప్రాంతంలో బీమా సేవలను అందించగలుగుతారు. డిసెంబర్ 9, 2024న ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటివరకు మొత్తం 2,05,896 మంది మహిళలు చేరారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ప్రతినెలా రూ.7,000 వరకు ఆదాయం పొందుతున్నారు.
Also Read: ఆ రోజు పగటిపూటే చీకటి.. వందేళ్ళకోసారి వచ్చే అద్భుతం ఇది..
ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీమా సఖీలకు మొత్తం రూ.62.36 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే, రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎల్ఐసీ ఈ పథకం కోసం రూ.520 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో జూలై 14 నాటికి ఇప్పటికే రూ.115.13 కోట్లు పంపిణీ చేశారు. బీమా సఖి యోజన ప్రత్యేకంగా 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల మహిళల కోసం రూపొందిచారు. ఈ పథకంలో 10వ తరగతి పాసైన మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. సెలక్ట్ అయిన మహిళలకు మూడేళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో వారికి బీమా ఉత్పత్తులు, సేవల గురించి సమాచారం అందిస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో వారికి ప్రతి నెలా గౌరవ వేతనం కూడా ఇస్తారు. మొదటి సంవత్సరం రూ.7,000, రెండో సంవత్సరం రూ.6,000, మూడో సంవత్సరం రూ.5,000 ఇస్తారు. అదనంగా, పాలసీలు విక్రయించినందుకు వచ్చే కమీషన్ కూడా వారికి చెల్లిస్తారు.
Also Read: 90 ల కాలం నాటి పిల్లల కే సాధ్యమైన ఈ అనుభూతులు.. వీడియో మిస్ కావద్దు
బీమా సఖి యోజన కేవలం తాత్కాలిక ఉపాధిని అందించడమే కాదు, మహిళలకు దీర్ఘకాలికంగా ఆర్థిక వనరును నిర్మించుకునే దిశగా కూడా ప్రోత్సహిస్తుంది. ఈ పథకం కింద ఐదేళ్ల ట్రైనింగ్ పూర్తి చేసిన మహిళలు అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. పథకం కింద మంచి పర్ఫామెన్స్ కనబరిచిన మహిళలకు ఎక్స్ ట్రా బెనిఫిట్స్ కూడా అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ పథకాన్ని చేరువ చేయడానికి భారతీయ జీవిత బీమా నిగమ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. రెండు సంస్థలు కలిసి ఒక ఒప్పందం పై సంతకాలు చేశాయి. తద్వారా ఈ పథకాన్ని గ్రామగ్రామానికి విస్తరించవచ్చు. ఈ ఒప్పందం గోవాలో జూలై 8 నుండి 10 వరకు జరిగిన జాతీయ సదస్సులో జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ మహిళలకు కూడా గౌరవప్రదమైన ఆదాయ వనరు లభిస్తుందని ఆశిస్తున్నారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళా సాధికారత రెండింటికీ ఒక పెద్ద ముందడుగు అవుతుంది.