Rare Solar Eclipse 2025: వినీలాకాశం అద్భుతాలకు పుట్ట. ప్రతిక్షణం సంభ్రమాశ్చర్యమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వెయ్యలేరు. పైగా ఆకాశంలో గ్రహాలు అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి రకరకాల మార్పులు చోటుచేసుకుంటాయి. ఉపగ్రహాలు వీటిని నిత్యం అధ్యయనం చేస్తున్నప్పటికీ చాలా రహస్యాలు అంతు పట్టవు. అందువల్లే అంతరిక్షాన్ని అద్భుతాలకు పుట్టిల్లు అని పిలుస్తుంటారు.. రకరకాల ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ.. ఉపగ్రహాలు నిత్యం పరిశీలిస్తున్నప్పటికీ.. మనిషి మేధ కు అంతుచిక్కని రహస్యం అంతరిక్షంలో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది..
Also Read: ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల్లో టాప్ ఎంట్రన్స్ పరీక్షలు, విద్యాసంస్థలు ఏవో తెలుసా?
అంతరిక్షంలో నిత్యం అద్భుతాలు జరుగుతూనే ఉంటాయని చెప్పుకున్నాం కదా.. అయితే అరుదైన సందర్భాల్లో సూర్యుడిని చంద్రుడు కప్పేస్తాడు. ఇది వింతగా ఉన్నప్పటికీ ముమ్మాటికి నిజం. సాధారణంగా సూర్యుడి ప్రభావంతోనే చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు. వాస్తవానికి చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు. సూర్యుడి ప్రభావం వల్ల వెలుగులీనుతూ ఉంటాడు. పైగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. చంద్రుడిలో అనేక అద్భుతాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ మనిషి మనుగడ సాగించడానికి అవకాశం లేదు. చంద్రుడిలో హీలియం నిల్వలు అధికంగా ఉంటాయి. అక్కడ భారరహిత స్థితి ఉంటుంది. హైడ్రోజన్ ద్రవస్థితిలో కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఆమ్లజని ఛాయలు ఉండదు కాబట్టి మనిషి, ఇతర జంతువులు బతకడానికి అవకాశం లేదు. పైగా అక్కడ అత్యంత గాఢమైన ఆమ్లాలు ఉంటాయి. అందువల్ల అక్కడ జీవులు మనగడ సాగించలేవు. కాకపోతే చంద్రుడి మీద ఉన్న మట్టి సారవంతమైనదని.. దానిపై ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: 90 ల కాలం నాటి పిల్లల కే సాధ్యమైన ఈ అనుభూతులు.. వీడియో మిస్ కావద్దు
చంద్రుడు స్వయం ప్రకాశితం కాకపోయినప్పటికీ అప్పుడప్పుడు సూర్యుడిని ప్రభావితం చేస్తుంటాడు. సూర్యుడిని పూర్తిగా కప్పేస్తుంటాడు. కాకపోతే ఈ అద్భుతం వందేళ్ళకు ఒకసారి మాత్రమే వస్తుంది. దీనిని అత్యంత దీర్ఘకాల సంపూర్ణ సూర్యగ్రహణం అంటున్నారు. 2027 ఆగస్టు రెండున ఇది సంభవిస్తుంది. దాదాపు 6 గంటల 20 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పి వేయడం వల్ల.. భూమిపై ప్రకటి సమయం కూడా రాత్రి మాదిరిగా కనిపిస్తుంది. భారతదేశం మినహాయించి దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత 2114లోనే ఇది సంభవిస్తుంది.. అయితే ఇది ఏర్పడేందుకు కారణం ఏమిటనేది శాస్త్రవేత్తలు ఇంతవరకు స్పష్టంగా చెప్పడం లేదు. కాకపోతే అప్పుడప్పుడు అనూహ్యమైన పరిస్థితుల్లో సూర్యుడు చంద్రుడి వల్ల ప్రభావితం అవుతాడని.. చంద్రుడు కప్పి వేయడం వల్ల కాంతి భూమి మీద పడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “దీనికి స్పష్టమైన కారణాలు తెలియదు. కాకపోతే అప్పుడప్పుడు ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇవి అంతరిక్షంలో అనూహ్యమైన మార్పులకు కారణమవుతుంటాయి. ఆ మార్పుల్లో ఇది కూడా ఒకటి. సూర్యుడి కాంతి వల్ల వెలుగొందే చంద్రుడు.. ఇలా ఒక్కసారిగా సూర్యుడిని కప్పి వేయడం ఒకింత ఆశ్చర్యకరమే. అందువల్లే ఆరోజు పగటిపూట కూడా చీకటిలాగా కనిపిస్తుంది. 10 నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతాలలో చీకటి అలముకుంటుంది. కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇలా గ్రహణం ప్రభావం కనిపించడం కూడా అద్భుతమేనని” శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల భూమికి వచ్చిన నష్టం ఏదీ ఉండదని.. అంతరిక్షంలో చోటు చేసుకునే మార్పు వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.