Lemon peel: నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. చాలామంది ఉదయం పూట నిమ్మకాయ నీరును తాగుతుంటారు. దీనివల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అయితే నిమ్మకాయను ఉపయోగించిన తర్వాత ఆ తొక్కలు దేనికి ఉపయోగపడవని కొందరు పడేస్తారు. మీరు కూడా ఇలానే అనుకున్నారా.. అయితే నిమ్మ తొక్కతో బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కేవలం నిమ్మకాయలతో మాత్రమే కాకుండా తొక్కలతో కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మ తొక్కల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, ఫైబర్ అనేక ఇతర పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మ తొక్కను పడేయకుండా నమిలితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి. మరి నిమ్మ తొక్కలను నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
నిమ్మ తొక్కల్లో విటమిన్ సితో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాగే నిమ్మతొక్కలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి నిమ్మతొక్కలు బాగా ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కలను నమలడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు. అలాగే కడుపు సంబంధిత సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడానికి కూడా నిమ్మ తొక్కలు బాగా ఉపయోగపడతాయి. ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. నిమ్మ తొక్క తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గుతారు. అలాగే మౌత్ ఫ్రెషనర్‌గా కూడా నిమ్మ తొక్క బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని సిట్రస్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. తద్వారా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
నిమ్మ తొక్కలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే గుండె ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది. నిమ్మతొక్కలో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. నిమ్మ తొక్కను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం సగం వరకు తగ్గుతుంది. అయితే ఈ నిమ్మ తొక్కను కేవలం నమలడమే కాకుండా పొడి కూడా చేసుకోవచ్చు. దీన్ని సలాడ్‌లో కూడా వాడితే టేస్ట్ బాగుంటుంది. నిమ్మ తొక్కలను ఈ సారి నుంచి పడేయకుండా ఇలా ఉపయోగిస్తే శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి నిమ్మ తొక్కలతో ఇలా పొడి లేదా సలాడ్, జ్యూస్‌లు ద్వారా అయిన తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.