https://oktelugu.com/

Ram Charan-Buchi Babu movie : మొదలైన రామ్ చరణ్, బుచ్చి బాబు మూవీ రెగ్యులర్ షూటింగ్..టైటిల్, స్టోరీ లైన్ వింటే మెంటలెక్కిపోతారు!

ఒక ఫోటో ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు డైరెక్టర్ బుచ్చి బాబు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతో కస్టపడి మేక్ ఓవర్ అయ్యాడు. సిక్స్ బాడీ ని పెంచడంతో పాటు, పొడవాటి గెడ్డంతో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసాడు రామ్ చరణ్.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 05:13 PM IST

    Ram Charan-Buchi Babu movie

    Follow us on

    Ram Charan-Buchi Babu movie : ‘గేమ్ చేంజర్’ చిత్రం తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చి బాబు తో ఒక పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో సాగే పీరియడ్ చిత్రంలో నటించబోతున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు , వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని , మైసూర్ ప్రాంతంలో చాముండేశ్వరి మాత ఆశీస్సులతో మొదలైంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు డైరెక్టర్ బుచ్చి బాబు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతో కస్టపడి మేక్ ఓవర్ అయ్యాడు. సిక్స్ బాడీ ని పెంచడంతో పాటు, పొడవాటి గెడ్డంతో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసాడు రామ్ చరణ్. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక్క ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

    అదే విధంగా జగపతి బాబు కూడా ఒక పవర్ ఫుల్ రోల్ లో నటించబోతున్నాడనని,మేకర్స్ నేడు ఆయనకీ స్వాగతం పలుకుతూ ఒక ట్వీట్ వేశారు. రామ్ చరణ్ తో గతంలో ఆయన రంగస్థలం చిత్రంలో నటించాడు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ ని ఎలా మలుపు తిప్పిందో, నటుడిగా ఆయనకీ ఏ రేంజ్ గుర్తింపుని తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్ళీ ఆయన రామ్ చరణ్ సినిమాలో నటిస్తుండడంతో అభిమానులు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఈ సినిమాని మల్లయోధుడు కోడి రామ్మూర్తి జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న బయోపిక్ అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఒక ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. దీనిపై బుచ్చి బాబు స్పందిస్తూ ‘అవన్నీ పూర్తిగా అవాస్తవాలు..మా సినిమా పల్లెటూరు వాతావరణం నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే’ అని చెప్పుకొచ్చాడు.

    నేచురల్ స్టార్ నాని నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ అనే చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమా కూడా అదే తరహా జానర్ లో ఉంటుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ప్రముఖ తమిళ హీరో సూర్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నది ఒక రూమర్ ఉంది. ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఇందులో శివ రాజ్ కుమార్ రామ్ చరణ్ కి కోచ్ గా కనిపించనున్నాడు. ఆయన పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుందట. రామ్ చరణ్, శివ రాజ్ కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు, థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా ఉండబోతోందట. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.