https://oktelugu.com/

Dil Raju: సినిమా టికెట్ రేట్లపై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Dil Raju: వినూత్నమైన చిత్రాలకు విక్రమ్ కె కుమార్ పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ‘థాంక్యూ’ సినిమా టికెట్ ధరల అంశం చర్చకు వచ్చింది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా సరసమైన ధరలకే లభిస్తుందని.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పెంచబోమని చెప్పుకొచ్చారు. ‘థాంక్యూ’ సినిమా కోసం జీఎస్టీ మినహాయించి మల్టీఫ్లెక్స్ లలో […]

Written By:
  • Shiva
  • , Updated On : July 21, 2022 / 10:36 AM IST
    Follow us on

    Dil Raju: వినూత్నమైన చిత్రాలకు విక్రమ్ కె కుమార్ పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ‘థాంక్యూ’ సినిమా టికెట్ ధరల అంశం చర్చకు వచ్చింది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా సరసమైన ధరలకే లభిస్తుందని.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పెంచబోమని చెప్పుకొచ్చారు. ‘థాంక్యూ’ సినిమా కోసం జీఎస్టీ మినహాయించి మల్టీఫ్లెక్స్ లలో రూ. 150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100 టికెట్ ధరలుగా ఉంటాయని హామీ ఇచ్చారు.

    Dil Raju

     

    ఆంధ్రప్రదేశ్ లో రేట్లు సాధారణంగానే ఉన్నాయి. కానీ.. నైజాం ఏరియాలో మాత్రం టిక్కెట్ ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ లో కొన్ని మల్టీప్లెక్స్లలో రూ. 200 ఉంటే మరికొన్నిట్లో రూ. 250 వరకూ టికెట్ రేట్లు ఉన్నాయి. రిక్లైనర్లు అయితే రూ. 300 – 350 గా ఉంది. సింగిల్ స్క్రీన్లలో అప్పర్ క్లాస్ లో రూ. 150 – రూ. 175.. లోయర్ క్లాస్ లో రూ.100 – రూ.110 గా ధరలు ఉన్నాయి. వీటికి జీఎస్టీ అదనంగా ఉంటుంది.

    Also Read: Kamal Haasan- Prabhas: ప్రభాస్ కొత్త సినిమాలో కమల్ హాసన్.. అభిమానులకు ఇక పండగే

    ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ లో చైతు ఒక ఎన్నారైగా నటిస్తున్నాడు. చైతు పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక చైతు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఇండియాకి వస్తాడని.. ఈ జర్నీలో గొప్ప సెంటిమెంట్ తో సాగే సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం నేపథ్యం చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ఇంటెన్సిటీతో కూడిన నటనతో ఉంటుందట.

    Dil Raju

    నిజానికి ఈ సినిమా కథ గురించి మరో రూమర్ కూడా బాగా వినిపిస్తోంది. ఓ మధ్యతరగతి అబ్బాయి ఎన్నో కష్టాలు పడి.. ఇంటర్ నేషనల్ గా ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎలా మారాడు ? ఈ క్రమంలో అతను ఎలాంటి అపజయాలు పొందాడు అనే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయట. అదేవిధంగా తన విజయ పథంలో తనకి సహకరించిన వారందరికీ అతను థాంక్స్ ఎలా చెప్పాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్.

    మొత్తమ్మీద ఈ క్రమంలో చైతు పాత్ర ఎలాంటి అనుభవాలు పొందాడు, అలాగే ఎలాంటి ఎమోషన్స్ జనరేట్ చేస్తాడు ? చివరకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే పాయింట్స్ మీద సినిమా ఎండింగ్ ఉంటుందట. మరి చూడాలి, పై రెండు పాయింట్స్ లో ఈ సినిమా ఏ పాయింట్ కి సంబంధించి ఉంటుందో. ఒక్కటి అయితే నిజం.. ఈ సినిమాలో చైతు చాలా కొత్తగా కనిపిస్తాడట.

    Also Read:Rajinikanth-Kamal Haasan: రజిని కాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో ముల్టీస్టార్ర్ర్ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

    Tags