Financial Management: 50-30-20 సూత్రం పాటిస్తే డబ్బుకు కొదువ ఉండదు..

డబ్బు సంపాదించడం కొందరికి తేలిక అవొచ్చు.. మరికొందరికి కష్టం కావొచ్చు. కానీ వచ్చిన ఆదాయాన్ని ప్రణాళిక లేకుండా ఖర్చు పెడితే ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిల్వదు.

Written By: Srinivas, Updated On : January 6, 2024 4:08 pm

Financial Management

Follow us on

Financial Management: ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం తప్పకుండా ఉంటుంది. దీని కోసం చెమటోడ్చి పనిచేసేవారు కొందరైతే.. తెలివితో ఆదాయాన్ని పొందేవారు మరికొందరు ఉంటారు. కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు ఆగదు. మరికొందరు ప్రణాళికతో డబ్బును ఆదా చేస్తున్నారు. ఆదాయం తక్కువ వచ్చినా ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసి మిగతాది పొదుపు చేస్తే భవిష్యత్ లో ఏ అవసరం ఉన్నా సమయానికి డబ్బు అందుబాటులో ఉంటుంది. అయితే దానికో సూత్రం పాటించాలి. అదే 50-30-20. ఈ సూత్రం ఆధారంగా డబ్బును ఖర్చు పెడుతూ పొదుపు చేయడం ద్వారా ఇంట్లో ఎప్పుడు డబ్బు కనిపిస్తుంది. మరి ఈ సూత్రం వివరాల్లోకి వెళితే..

డబ్బు సంపాదించడం కొందరికి తేలిక అవొచ్చు.. మరికొందరికి కష్టం కావొచ్చు. కానీ వచ్చిన ఆదాయాన్ని ప్రణాళిక లేకుండా ఖర్చు పెడితే ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిల్వదు. చాలా మంది ఇంట్లో డబ్బు నిల్వ లేకపోతే తమ జాతకం బాగాలేదు అని భావిస్తారు. ఇందు కోసం ఏవేవో కార్యక్రమాలు చేస్తారు. కానీ ఒక పద్ధతి ప్రకారంగా డబ్బును మెయింటనెన్స్ చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవనే విషయాన్ని ఆలోచించరు. కొందరు నిపుణులు పై సూత్రం ప్రకారంగా డబ్బు ను మరలిస్తే ఎటువంటి సమస్యలు ఉండవని తెలుపుతున్నారు.

ఇక 50-30-20 సూత్రం వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తికి ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంలో 50 శాతం ఇంట్లో ఖర్చుల కోసం పక్కనబెట్టుకోవాలి. ఇంట్లో ఎటువంటి అవసరం ఉన్నాఈ 50 శాతంలోనే ఖర్ఛు పెట్టే విధంగా ప్లాన్ చేసుకోవాలి. రెండోది 30 శాతం ఇతర విలాసాలకు కేటాయించుకోవాలి. ఎంత సంపాదించిన జీవితంలో ఆనందం కరువు అనే ఫీలింగ్ ఇంట్లో వాళ్ల నుంచి రాకుండా వారి అవసరాలు తీర్చాలి. పిల్లలకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయాలి. అయితే ఇది 30 శాతంలోపే ఉండాలనే విషయాన్ని గ్రహించాలి.

మూడోది 20 శాతం డబ్బును పొదుపు చేయాలి. చాలా మంది ఎక్కువ డబ్బును పొదుపు చేయాలనే ఉద్దేశంలో ఇంట్లో అవసరాల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో డబ్బు ఉన్నా.. ప్రేమానుబంధాలు కరువవుతాయి. ఇక 30 శాతం కోసం కేటాయించిన మొత్తంతో విలాసాలకు ఖర్చుపెట్టాలి. అయితే వీటిని తగ్గించుకోవాలనుకుంటే పొదుపును పెంచుకోవచ్చు. పొదుపు తక్కువగా ఉందని భావిస్తే వ్యాపారస్తులు రెండో వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించాలి. అప్పుడే ఖర్చులు పెరిగినా.. పొదుపు చేసే అవకాశం ఉంటుంది.