SSC: ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఏడు పేపర్లు మాత్రమే?

SSC: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల విద్యార్థులపై ఊహించని స్థాయిలో ఒత్తిడి పెరిగింది. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి ఈ మేరకు సవరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు కేవలం ఏడు పేపర్లు మాత్రమే ఉండనున్నాయి. సామాన్యు శాస్త్రంకు రెండు పేపర్లు ఉండగా మిగిలిన సబ్జెక్టులకు కేవలం ఒక పేపర్ మాత్రమే ఉండనుంది. 100 మార్కులకు మొత్తం […]

Written By: Kusuma Aggunna, Updated On : December 18, 2021 12:14 pm
Follow us on

SSC: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల విద్యార్థులపై ఊహించని స్థాయిలో ఒత్తిడి పెరిగింది. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి ఈ మేరకు సవరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు కేవలం ఏడు పేపర్లు మాత్రమే ఉండనున్నాయి. సామాన్యు శాస్త్రంకు రెండు పేపర్లు ఉండగా మిగిలిన సబ్జెక్టులకు కేవలం ఒక పేపర్ మాత్రమే ఉండనుంది.

SSC Students

100 మార్కులకు మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండగా జీవశాస్త్రం మరో పేపర్ గా ఉండనుంది. 2022 సంవత్సరం మార్చి నెల నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. కరోనా వల్ల గతేడాది ఈ ఏడాది ఏపీలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. విద్యార్థులకు జవాబు పత్రానికి 24 పేజీల బుక్ లెట్ ను ఇవ్వనున్నారు. అదనంగా సమాధాన పత్రాలను ఇస్తే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: పీపీఎఫ్ లో చేరితే పొందే లాభాలు ఇవే.. తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే?

ప్రశ్నల సంఖ్య విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని సామాన్య శాస్త్రంలో రెండు ప్రశ్నాపత్రాలు ఉన్నందున ప్రశ్నలకు ఇచ్చే మార్కులు తగ్గుతాయని సమాచారం. ప్రశ్నాపత్రంలో సూక్ష్మ లఘుప్రశ్నలు 12, తేలికైన ప్రశ్నలు 8, లఘు ప్రశ్నలు 8, వ్యాసరూప ప్రశ్నలు 5 ఉండనున్నాయి. సూక్ష్మ లఘు ప్రశ్నలకు ఒక మార్కు, తేలికైన ప్రశ్నలకు 2 మార్కులు, లఘు ప్రశ్నలకు 4 మార్కులు, వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులు ఉంటాయి.

సూక్ష్మ లఘు ప్రశ్నలకు మొత్తం 12 మార్కులు, తేలికైన ప్రశ్నలకు మొత్తం 16 మార్కులు, లఘు ప్రశ్నలకు మొత్తం 32 మార్కులు, వ్యాసరూప ప్రశ్నలకు 40 మార్కులు కేటాయించడం జరుగుతుంది.

Also Read: టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!